Support | మోదీకి పుతిన్ కాల్ .. ఉగ్ర‌వాదంపై పోరుకు మ‌ద్దతు

న్యూఢిల్లీ – ఉగ్రవాదంపై పోరులో భారత్‌కు సంపూర్ణ మద్దతిస్తునట్టు రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ప్రకటించారు. ప్రధాని మోదీకి పుతిన్‌ ఫోన్‌ చేశారు. పహల్గామ్‌ దాడికి తీవ్రంగా ఖండిస్తునట్టు పుతిన్‌ తెలిపారు. పహల్గామ్‌ దాడికి పాల్పడ్డ ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలన్నారు. ఉగ్రదాడి బాధితులకు న్యాయం చేయాలన్నారు.

ఉగ్రవాదంపై పోరాటంలో భారతదేశానికి మద్దతు ఇవ్వడానికి రష్యా తన నిబద్ధతను పునరుద్ఘాటించింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సోమవారం భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఫోన్ చేసి పహల్గామ్ ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ వెల్లడించారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఫోన్ చేసి భారతదేశంలోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండించారన్నారు. అమాయక ప్రజల మరణాలకు ఆయన తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఉగ్రవాదంపై పోరాటంలో భారతదేశానికి పూర్తి మద్దతు ఇస్తున్నట్లు ఆయన వెల్లడించారు. పహల్గామ్‌ దాడికి పాల్పడ్డ ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలన్నారు. ఉగ్రదాడి బాధితులకు న్యాయం చేయాలన్నారు.

ఈ దారుణమైన దాడికి పాల్పడిన నిందితులను, వారికి సహాకరించిన వారిని న్యాయం ముందు నిలబెట్టాలని పుతిన్ స్పష్టం చేశారు. భారతదేశం-రష్యా మధ్య ప్రత్యేక, విశేష వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింతగా బలోపేతం చేయడానికి తమ నిబద్ధతను ఇద్దరు నాయకులు పునరుద్ఘాటించారు. 80వ విజయ దినోత్సవం సందర్భంగా అధ్యక్షుడు పుతిన్‌కు ప్రధానమంత్రి తన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సంవత్సరం చివర్లో భారతదేశంలో జరగనున్న వార్షిక శిఖరాగ్ర సమావేశానికి పుతిన్‌ను ఆహ్వానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *