7వ వార్డులో కాంగ్రెస్ కు వెల్లువెత్తుతున్న మద్దతు..

7వ వార్డులో కాంగ్రెస్ కు వెల్లువెత్తుతున్న మద్దతు..
పరకాల, ఆంధ్రప్రభ : పరకాల మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ 7వ వార్డు చైర్మన్ అభ్యర్థి పావుశెట్టి సునీల్ కు అన్ని వర్గాల నుండి మద్దతు లభిస్తుంది. సోమవారం రోజు పరకాల పురపాలక సంఘం విలీన సీతారాంపురం గ్రామం 7వ వార్డులోని ఇంటింటికి తిరుగుతూ విస్తృత ప్రచారం నిర్వహించారు. వార్డులోని వివిధ కాలనీలో ఓటర్లను కలుస్తూ సమస్యలు తెలుసుకుని వాటి శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తానని ఓటర్లకు హామీ ఇవ్వడం జరిగింది. ఏడవ వార్డులోని అన్ని వర్గాల ప్రజలు చైర్మన్ అభ్యర్థి పావుశెట్టి సునీల్ ను ఆదరించి ఈ ఎన్నికల్లో తమ ఓటు కాంగ్రెస్ పార్టీ చేతు గుర్తుకే వేస్తామని అభయం ఇవ్వడం జరిగిందని తెలిపారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి సునీల్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ఏడో వార్డులోని ఓటర్లకు అందేలా కృషి చేస్తానన్నారు. వార్డులోని ఓటర్లు సమస్యలు ఏమైనా ఉంటే తన దృష్టికి తీసుకొస్తే పరిష్కారానికి కృషి చేస్తా అన్నారు. 7వ వార్డులోని ఓటర్లు ఆశీర్వదించి కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో తనను గెలిపించాలని కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
