12వ వార్డులో పారిశుద్ధ్య పనుల పర్యవేక్షణ..

పరకాల, ఆంధ్రప్రభ: పరకాల పట్టణంలోని 12వ వార్డులో పారిశుద్ధ్య పనులను వార్డు కౌన్సిలర్ ఆకుల లావణ్య శ్రీధర్ పర్యవేక్షించారు. వార్డులోని వివిధ కాలనీల డ్రైనేజీలలో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని ఆమె దగ్గరుండి పారిశుద్ధ కార్మికుల చేత శుభ్రం చేయించారు.
అదేవిధంగా కాలనీలలో ఉన్న చెత్తకుప్పలను తొలగించి, వార్డు పరిసర ప్రాంతాలను శుభ్రపరిచారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ లావణ్య శ్రీధర్ కాలనీవాసులతో మాట్లాడారు.
మన ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంలో ప్రతి ఒక్కరి బాధ్యత ఉందని ఆమె పేర్కొన్నారు. వార్డులో ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని, వాటి పరిష్కారానికి ఎప్పుడైనా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
