ప్రచార పర్వంలో…

జూబ్లీహిల్స్ : బీఆర్ఎస్ కంచుకోట జూబ్లీహిల్స్ (Jubilee Hills) అంటూ.. ప్రచార పర్వంలో దూకుడు పెంచారు మాగంటి సునీత. ప్రత్యర్థుల అంచనాలను తలకిందులు చేస్తూ భారీ మెజార్టీ దిశగా వ్యూహ ప్రతి వ్యూహాలతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేడి రాజేసింది. ప్రత్యర్థుల అంచనాలు తలకిందులు చేస్తూ బీఆర్ఎస్ ఊహ ప్రతి వ్యూహాలకు పదును పెట్టి ముందుకు దూసుకెళ్తుంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి మాగంటి సునీత గోపినాథ్ గురువారం మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎమ్మెల్సీ తాత మధు, మాజీ జడ్పీ చైర్ పర్సన్ తుల ఉమా, స్థానిక కార్పొరేటర్ దేదీప్య విజయ్, బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ అహ్మద్ సతీమణి అయేషాతో కలిసి వెంగళరావు నగర్ డివిజన్ లోనీ వికాస్ పురి కాలనీ, సిద్ధార్థ నగర్, ఏజీ కాలనీలలో ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు.

కాలనీవాసులు అడుగడుగునా మాగంటి సునీతమ్మ (Maganti Sunithamma) పై ఆధరాభిమానాలు చూపిస్తూ విజయం ఎప్పుడో నిర్ణయించబడిందని, మెజార్టీ ఎంత అనేదే తెలియాల్సివుందని తెలిపారు. భారీ మెజార్టీతో జూబ్లీహిల్స్ గడ్డ పై బీఆర్ఎస్ జెండా ఎగురవేయాలన్నారు. మీ ఆకాంక్షల మేరకు అభివృద్ధి పథంలో మీ వెనక నడవడానికి సిద్ధంగా ఉన్నామని భరోసానందించారు. అనంతరం ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావులు కృష్ణ కాంత్ పార్క్ సమీపంలో జెండా ఊపి పైకి మహిళా బైక్ ర్యాలీ ప్రారంభించారు.

మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తానన్న ప్రతి నెల రూ.2,500, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ రూ 1 లక్ష చెక్కుతో పాటు ఒక తులం బంగారం ఇస్తామన్న హామీ, చదువుకునే యువతులకు స్కూటీలు ఇస్తామన్న మరో హామీ కూడా నెరవేర్చలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను, ముఖ్యంగా మహిళలను ఇబ్బందుల గురిచేస్తున్న నేపథ్యంలో ఈ ర్యాలీ నిర్వహించడం జరిగిందని నిర్వాహకులు తెలిపారు.

Leave a Reply