సీఎం ఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన సుజనా చౌదరి..

సీఎం ఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన సుజనా చౌదరి..

భవానిపురం, ఆంధ్రప్రభ : పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించిన 34 మందికి రూ 17,86,037/- రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను బాధిత కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే సుజనా చౌదరి అంద చేశారు. భవానీపురంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో చెక్కులను లబ్ధిదారులకు అందచేశారు. అదే విధంగా ఒక కేన్సర్ రోగికి వైద్య సాయం కోసం 29 లక్షల రూపాయల ఎల్వోసీ పత్రాన్ని కూడా అంద చేశారు. బాధితుల కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే సుజనా చౌదరికి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్, కార్పొరేటర్లు బుల్లా విజయ్ కుమార్, మాధురీ లావణ్య, టీడీపీ నాయకులు అబ్దుల్ ఖాదర్, ఏదుపాటి రామయ్య, కూటమి నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply