Suicide | చికిత్స పొందుతూ యువకుడు మృతి

Suicide | చికిత్స పొందుతూ యువకుడు మృతి
Suicide | లక్షేట్టిపేట, ఆంధ్ర ప్రభ : మున్సిపాలిటీ పరిధిలోని గంపలపల్లికి చెందిన అగ్గు రమేష్ (32) అనే వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుని చికిత్స పొందుతూ ఈ రోజు కరీంనగర్ ఆసుపత్రిలో మృతి చెందినట్లు ఎస్సై గోపతి సురేష్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం… మృతునికి మానసిక పరిస్థితి బాగోలేక గత పది సంవత్సరాల నుండి కరీంనగర్లోని ప్రశాంతి ఆసుపత్రిలో వైద్యులకు చూయించుకొని మందులు వాడుతున్నడన్నారు.
మందులు వాడినా తన మానసిక పరిస్థితి బాగుపడలేదన్నారు. తరచుగా ఆయనే చనిపోతానని అందరం ఒకసారి చనిపోయే వాళ్ళం అంటూ చెప్పేవాడని, గత కొన్ని సంవత్సరాల క్రితం ఇలానే అంటూ ఆత్మహత్యకు పాల్పడగా కుటుంబ సభ్యులు గమనించి ఆసుపత్రిలో చికిత్స చేయించారన్నారు.
అదే క్రమంలో ఈనెల 8న ఉత్కూర్ శివారులోని వాళ్ళ సొంత పొలంలో గడ్డికి కొట్టే మందు తాగి ఇంటికి వచ్చి వాంతులు చేసుకొని కుటుంబ సభ్యులకు మందు తాగిన విషయం చెప్పడంతో కుటుంబీకులు స్థానికుల సాయంతో తక్షణమే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అనంతరం వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడన్నారు. మృతునికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారన్నారు. మృతుని భార్య పెంకర్ల ప్రోనూష అలియాస్ అగ్గు లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
