SUICIDE | ఏమైందో తెలియదు కానీ…

SUICIDE | ఏమైందో తెలియదు కానీ…
SUICIDE | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : ప్రేమజంట ఆత్మహత్య చేసుకున్న ఘటన తెలంగాణ రాష్ట్రంలోని నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం సిద్దాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బొమ్మనపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి… బొమ్మనపల్లి గ్రామానికి చెందిన దాసరి ప్రశాంత్ అనే యువకుడు పదరా మండలం చిట్లంగుంట గ్రామానికి చెందిన సువర్ణ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు.
ఇద్దరు ఇష్టపడి పెళ్లి చేసుకోవాలని అనుకున్నారనీ.. అయితే ఇటీవల అమ్మాయి అబ్బాయి ఇంటికి రావడంతో అమ్మాయి తల్లిదండ్రులు మందలించారని తెలిపారు. ఈ క్రమంలో ఇరువురు మనస్థాపానికి గురైనట్లు తెలుస్తోంది. అయితే మంగళవారం అమ్మాయి తమ స్వగ్రామం నుండి అబ్బాయి గ్రామానికి చేరుకున్నారని.. ఒకరిని విడిచి ఒకరు ఉండలేమని క్షణికావేశానికి గురై రాత్రి ఒకే చీరతో ఇద్దరూ హ్యాంగింగ్ చేసుకొని మృతి చెందారని తెలిపారు.
ఇవాళ ఉదయం సోదరుడు అనుమానం వచ్చి ఇంటి తలుపుతట్టగా.. ఎలాంటి ఉలుకు పలుకు లేకపోవడంతో బలవంతంగా తలుపులు పగలగొట్టి ఇంట్లోకి వెళ్లి చూడగా.. వారిద్దరూ విగత జీవులుగా కనిపించారు. గ్రామస్తులు పోలీసుల దృష్టికి తీసుకెళ్లడంతో అచ్చంపేట డీఎస్పీ పల్లె శ్రీనివాస్, సీఐ నాగరాజు ఘటన స్థలానికి చేరుకొని మృతులను అచ్చంపేట ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. బంధువుల నుంచి ఫిర్యాదు అందలేదని.. ఫిర్యాదు అందగానే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామన్నారు.
