Suicide | ప్రియుడి మృతి తట్టుకోలేక..
- యువతి ఆత్మహత్య
Suicide | కంకిపాడు, ఆంధ్రప్రభ : సూర్యారావుపేటకు చెందిన తాటికొండ లోహిత (22) కంకిపాడులో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. వారం క్రితం తన ప్రియుడు చనిపోవడంతో లోహితను కంకిపాడు(kankipadu)లోని పిన్నివాళ్ళ ఇంటికి తల్లిదండ్రులు పంపారు. వారం నుంచి మానసిక వేదనకు గురవుతుందని బంధువులు తెలిపారు. శుక్రవారం ఉదయం లేచే సరికి పిన్నివాళ్ళ ఇంట్లో లోహిత ఉరికి వేలాడుతూ కనిపించింది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం(Postmortem) నిమిత్తం ఉయ్యూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి కంకిపాడు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

