చెరువులో పడి వ్యక్తి ఆత్మహత్య

చెరువులో పడి వ్యక్తి ఆత్మహత్య

గీసుగొండ, ఆంధ్రప్రభ : మద్యానికి బానిసైన వ్యక్తి కుటుంబ కలహాల నేపథ్యంలో ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మచ్చాపురంలో చోటుచేసుకుంది. సీఐ విశ్వేశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని మచ్చాపురం గ్రామానికి చెందిన మొగుసాని లక్ష్మణ్ (37) గత కొంతకాలంగా మద్యానికి బానిసై కుటుంబ సభ్యులతో తరచూ గొడవలు పడుతూ బాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్నాడు.

గత నాలుగు రోజులుగా ఇంటిలో కలహాలు కొనసాగుతుండగా,శుక్రవారం ఉదయం అతని తండ్రి మొగుసాని కనకయ్య,భార్య కలిసి ప్రవర్తన మార్చు కోవాలని మందలించారు. ఈ నేపథ్యంలో మద్యం మత్తులో ఉన్న లక్ష్మణ్ మధ్యాహ్నం గంగదేవిపల్లి చెరువులో పడి మృతి చెందినట్లు తెలిపారు. మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనపై పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.

Leave a Reply