Suicide | కోసిగి, ఆంధ్రప్రభ : కోసిగి రైల్వేస్టేషన్ సమీపంలో కిలోమీటర్ 523/8–10 రాయి వద్ద ఆదివారం ఉదయం డౌన్ లైన్ ట్రాక్ మీదుగా వెల్లు బెంగుళూరు నుంచి బీదర్(Bangalore to Bidar) పోవు ట్రైన్ కిందపడి కర్ణాటక రాష్ట్రం, రాయచూరు జిల్లా మాన్వి తాలూకా ఆరోలి గ్రామానికి చెందిన తిమ్మప్ప (40) అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడని రైల్వే హెడ్ కానిస్టేబుల్ శివరామయ్య తెలిపారు. మృతుడికి గత సంవత్సరం నుంచి కడుపులో పుండ్లు అయి నోటి నుంచి రక్తం కక్కుతూ బాధపడుతున్నట్లు మృతుని కుటుంబ సభ్యులు తెలిపినట్లు ఆయన వెల్లడించారు. రాయచూరులోని రిమ్స్(rims) ఆసుపత్రిలో చికిత్స చేసుకొన్నప్పటికి నయం కాకపోవడంతో జీవితం మీద విరక్తి కలిగి రైలు కిందపడి చనిపోయాడని శివరామయ్య తెలిపారు. ఈ మేరకు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
Suicide | రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య

