Sudden inspection | ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ…

Sudden inspection | మెద‌క్‌, ఆంధ్ర‌ప్రభ : మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలో ఈ రోజు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ శ్రీరాం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సిబ్బంది హాజరు, రికార్డులను సమగ్రంగా పరిశీలించి విధుల్లో సమయపాలన తప్పనిసరిగా పాటించాలని సూచించారు. అనంతరం జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలుపై వైద్యాధికారి వై. రవికుమార్, పీ. రేణుక (PHNO), ఎన్. శ్రీనివాస్ (MPHEO)తో పాటు ఇతర సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆరోగ్య సేవల అమలుపై సంతృప్తి వ్యక్తం చేస్తూ, ఇదే విధమైన సేవాభావంతో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు.

Leave a Reply