మునిగిన బంటుమిల్లి వైఎస్సార్ కాలనీ
(ఆంధ్రప్రభ – కృష్ణా ప్రతినిధి): కృష్ణా జిల్లా (KrishnaDistrict) పెడన నియోజకవర్గం బంటుమిల్లిలోని వైఎస్సార్ కాలనీ వర్షపు నీటితో నిండి, ప్రజలు పాములతో సహవాసం చేస్తున్నారని కాలనీవాసులు సోమవారం కలెక్టర్ బాలాజీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. గత ప్రభుత్వం సుమారు 620 కుటుంబాలకు పట్టాలు ఇవ్వగా, స్థలం పోతుందనే భయంతో లబ్ధిదారులు అప్పు చేసి మరీ ఇళ్లు కట్టుకున్నారు.
కాలనీలో పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని, అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని వారు వేడుకుంటున్నారు. డ్రోన్ కెమెరాతో ఇక్కడున్న పరిస్థితిని విజువల్స్ తీశారు. కాలనీలోకి వచ్చిన నీటిని బయటకు వెళ్లేలా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

