భారత వ్యోమగామి శుభాంశు శుక్లా త‌న‌ అంతరిక్ష యాత్ర విజయవంతంగా పూర్తి చేసి తిరిగి స్వదేశానికి చేరుకున్నారు. న్యూఢిల్లీకి చేరుకున్న అనంతరం ఆయన ప్రధాని నరేంద్ర మోదీ నివాసానికి వెళ్లి భేటీ అయ్యారు.

ఐస్రో ప్రత్యేక అస్ట్రోనాట్ జాకెట్ ధరించి వచ్చిన శుక్లాను ప్రధాని నరేంద్ర మోదీ హృదయపూర్వకంగా ఆలింగనం చేసుకున్నారు. అంతరిక్ష కేంద్రంలో గడిపిన క్షణాలను శుభాంశు శుక్లా మోదీతో పంచుకున్నారు. ఈ సంద‌ర్భంగా “ఇది కేవలం వ్యక్తిగత విజయం కాదు, దేశానికి గర్వకారణం” అని ప్రధాని అభినందించారు.

జూన్ 25న ప్రారంభమైన యాక్సియం–4 మిషన్లో శుభాంశు భాగమయ్యారు. త‌న‌ బృందం 18 రోజుల పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో పరిశోధనలు నిర్వహించారు. ఈ సాహసయాత్రలో ఆయన అంతర్జాతీయ ISS చేరుకున్న తొలి భారతీయ వ్యోమగామిగా నిలిచారు. జూలై 15న భూమికి తిరిగొచ్చి, చరిత్రలో ఆయన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్నారు.

Leave a Reply