సబ్ ఇన్స్ పెక్టర్ పై సస్పెన్షన్ వేటు..

సబ్ ఇన్స్ పెక్టర్ పై సస్పెన్షన్ వేటు..

  • మంత్రి ఇలాఖాలోని ఎసై పై చర్యలు..
  • మహిళ పట్ల అనుచిత వ్యవహారమే కారణం..
  • డిపార్ట్మెంట్ విచారణతో చర్యలు
  • ఆదేశాలు జారీ చేసిన సీపీ సన్ ప్రీత్ సింగ్

వరంగల్ క్రైమ్, ఆంధ్రప్రభ : పోలీస్ శాఖ పరువు ,ప్రతిష్టలకు భంగం కలిగించే పోలీస్ అధికారుల పై పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ క్రమశిక్షణ చర్యలు చేపడుతున్నారు. రాష్ట్ర మంత్రి కొండా సురేఖ ఇలాఖలో పని చేసే అధికారి పై అనేక అవినీతి ఆరోపణలతో పాటు మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించిన్నట్టుగా ఆరోపణలు వచ్చాయి. ఈ విషయం పై వరంగల్ ఏఎస్పీ శుభం దృష్టిగా రాగానే సదరు ఎసైని రెగ్యులర్ గా నియమించే వీధుల నుంచి తప్పించి నేర విభాగం విధులు అప్పగించారు. ఐపీఎస్ ఆఫీసరైన వరంగల్ ఎస్పీ శుభం పోలీస్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ అంశం పై పోలీస్ కమీషనర్ సన్ ప్రీత్ సింగ్ శాఖాపరమైన విచారణకు ఆదేశించారు.

సదరు విచారణలో ఆరోపణలు నిజమని నిర్ధారించిన్నట్లుగా తెలుస్తోంది. సదరు సిఫార్సు మేరకు పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ సస్పెన్షన్ వేటు వేసిన్నట్లుగా తెలుస్తోంది. ఎసై మంత్రికి అత్యంత సన్నిహితుడైన వ్యక్తితో సత్సంబంధాలు కలిగి ఉన్నారు. సదరు నేత అండదండతో ఆ ఎసై దురుసుగానే కాక ఎవ్వరిని లెక్క చేయకుండా వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి. ఎసై పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడానికి ఆరు మాసాలకు పైగా పట్టింది. పోలీస్ కమీషనర్ చర్యలతో మరికొందరు పోలీస్ ఆఫీసర్స్ పై క్రమశిక్షణ చర్యలు ఖాయమన్నట్టుగా తెలుస్తోంది.

Leave a Reply