Sub Center | రైతులకు ఇబ్బంది లేకుండా చూస్తాం.

Sub Center | రైతులకు ఇబ్బంది లేకుండా చూస్తాం.
Sub Center | ఊట్కూర్, ఆంధ్రప్రభ : వర్షాకాలంలో రైతులు పండించిన వరి ధాన్యం కొనుగోలు సబ్ సెంటర్(Sub Center) వద్ద ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తామని పెద్ద జట్రం వ్యవసాయ విస్తీర్ణ అధికారిని స్వప్న అన్నారు. ఈ రోజు నారాయణ పేట జిల్లా(Narayanapet District) ఊట్కూర్ మండల పరిధిలోని పెద్ద జట్రం క్లస్టర్ పరిధిలోని ఆవుసులోని పల్లి వరి ధాన్యం కొనుగోలు సబ్ సెంటర్‌ను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఏఈఓ మాట్లాడుతూ.. నారాయణపేట రెవెన్యూ అదనపు కలెక్టర్ శీను(Additional Collector Sheenu) ఆదేశాల మేరకు ఆవుసులోనిపల్లి గ్రామ శివారులో వరి కొనుగోలు చేసేందుకు సబ్ సెంటర్ ఏర్పాటు చేశామని అన్నారు. రైతులు పండించిన ధాన్యం పెద్ద జట్రం గ్రామానికి తీసుకువచ్చేందుకు ఆరు కిలోమీటర్ల దూరం ఉండడంతో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా కొనుగోలు కేంద్రం దగ్గరలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
రెవెన్యూ కలెక్టర్ తమ సమస్యలను దృష్టిలో ఉంచుకొని తాము పండించిన వరి ధాన్యం(Vari Dhanyam) కొనుగోలు చేసేందుకు సబ్ సెంటర్ ఏర్పాటు చేయడం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద జట్రం ధాన్యం కొలుగోలు అధికారి విద్యాసాగర్, ఊట్కూర్ మండల భారతీయ కిసాన్ సంగ్ అధ్యక్షుడు ప్రవీణ్ కాంత్, రైతులు సాయిబాబా, వెంకటయ్య, నర్సిములు, వడ్డేమాన్ బాబు రెడ్డి, వడ్డేమాన్ లక్ష్మిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
