SPORTS | క్రీడా పోటీల్లో విద్యార్థునుల ప్రతిభ

ఎంపికైన విద్యార్థులను అభినందించిన హెచ్ఎం ఉపాధ్యాయులు
రాష్ట్రస్థాయి క్రీడలకు కోహినూర్ (కే) విద్యార్థినీల ఎంపిక

SPORTS | సిర్పూర్ (యు) (ఆంధ్రప్రభ) : రాష్ట్రస్థాయి క్రీడలకు కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (యు) మండలంలోని కోహినూర్ (కే) ఆశ్రమ పాఠశాల 13 మంది విద్యార్థునులు ఎంపిక అయ్యారని ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు పూసం నాందేవ్, క్రీడల పీఈటీ కనక వెంకటేశ్వరరావు తెలిపారు.
తమ పాఠశాల విద్యార్థునులు జోనల్ లెవెల్ గిరిజన క్రీడా పోటీల్లో ప్రతిభ కనబరిచి, రాష్ట్రస్థాయి క్రీడలకు కోహినూర్ (కె) పాఠశాల ప్రధానోపాధ్యాయులు పూసం నాందేవ్ తెలిపారు. కబడ్డీ సీనియర్ విభాగంలో కె. మంజుల (9వ తరగతి), వాలీబాల్ జూనియర్ విభాగంలో పి. పుల్లవంతి, కె. లక్ష్మి (8వ తరగతి), ఖోఖో సీనియర్ విభాగంలో ఎం. గౌరు (9వ తరగతి), క్యారం జూనియర్ విభాగంలో జి. లావణ్య, ఎస్. శిరీష (8వ తరగతి), చెస్ జూనియర్ విభాగంలో ఎం. లావణ్య (7వ తరగతి), అథ్లెటిక్స్ సీనియర్ విభాగంలో జి. రమేశ్వర్ (9వ తరగతి), జూనియర్ విభాగంలో హెచ్‌కే. గౌరు, ఎస్. శ్రీమలరాణి (6వ తరగతి), హైజంప్ సీనియర్ విభాగంలో హెచ్‌కే. దుర్గాదేవి (9వ తరగతి) రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొననున్నారని 13 మంది విద్యార్థినిలు రాష్ట్ర స్థాయిలో పోటీలకు ఎంపిక కావడం పాఠశాలకి గర్వకారణమని వారు పేర్కొన్నారు.

ఎంపికైన విద్యార్థునులను జైనూర్ ఏటిడిఓ శ్రీనివాస్, ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు అభినందించి మెమెంటోలు అందజేశారు. ఈకార్యక్రమంలో పాఠశాల పిఈటీ కనక వెంకటేశ్వరరావు, ఉపాధ్యాయులు లక్ష్మణ్ రావు, పూల్ సింగ్, మాధవి, లక్ష్మి, భాగ్యలక్ష్మి, అరుణ, అరవింద్,శశికళ,దన్లాల్,పారుబాయి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply