విద్యార్థులు సైన్స్ పట్ల అవగాహన కలిగి ఉండాలి..

చిట్యాల, ఆంధ్రప్రభ : విద్యార్థులు చిన్నతనం నుండే సైన్స్ పట్ల అవగాహన కలిగి ఉండాలని చిట్యాల తహసిల్దార్ ఇమా ఈ బాబా కోరారు. శనివారం మండల కేంద్రంలోని కాకతీయ హైస్కూల్లో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల తహసిల్దార్ ఇమామ్ బాబా, చిట్యాల సర్పంచి తవటం లక్ష్మి, ఉప సర్పంచ్ బుర్ర వెంకటేష్ గౌడ్ లు పాల్గొన్నారు.
అనంతరం తాసిల్దార్ మాట్లాడుతూ.. విద్యార్థులు చిన్నతనం నుండే చదువుతోపాటు సైన్స్ పైన అవగాహన కలిగి ఉండాలని మూఢనమ్మకాలు నమ్మవద్దని మిస్సెల్ మేన్ ఆఫ్ ఇండియా ఏపీజే అబ్దుల్ కలాంను ఆదర్శంగా తీసుకుని కలలు కనీ వాటిని సహకారం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు మైదo శ్రావ్య శ్రీకాంత్ , పాఠశాల కరస్పాండెంట్ మహమ్మద్ రాజ్ మహమ్మద్, పాఠశాల పేరెంట్స్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు, పాల్గొన్నారు.
