రాష్ట్రస్థాయి సీఎం కప్ క్రీడలలో సత్తా చాటిన విద్యార్థులు

చిట్యాల, ఆంధ్రప్రభ : మండలంలోని నైన్ పాక ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు రాష్ట్రస్థాయి సీఎం కప్ క్రీడలలో పాల్గొని సాఫ్ట్ బాల్ క్రీడలో భూపాలపల్లి జిల్లాకు రాష్ట్రస్థాయిలో మూడవ స్థానం సాధించడంలో విద్యార్థులు కీలకపాత్ర వహించారని ప్రధానోపాధ్యాయురాలు ఊర్మిళ గురువారం తెలిపారు. రాష్ట్రస్థాయి సీఎం కప్ సాఫ్ట్బాల్ క్రీడలలో ఎస్. వర్షిత్, డి .సనత్ సూర్య, కె .స్వేచ్ఛ, టి. వాగ్దేవి పాల్గొని భూపాలపల్లి జిల్లాకు తృతీయ స్థానం సాధించడంలో కీలకపాత్ర వహించారన్నారు. రాష్ట్రస్థాయి సీఎం కప్ సాఫ్ట్. హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో రాష్ట్రస్థాయి బేస్బాల్ క్రీడలో పి .భరత్ ,కే.రాజు ,పి .పవన్, కళ్యాణ్ ,జి. మధువర్యా పాల్గొన్నారు . ఖమ్మంలో జరిగిన రాష్ట్ర స్థాయి బాల్ బ్యాడ్మింటన్ లో ఎం శివకుమార్ పాల్గొన్నారు. .ఈకార్యక్రమంలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు సుధాకర్, ప్రణీత,పల్లవి ,రఘు ,రాజయ్య ,నాగరాజు, రఘునాథ్ ,శ్రీనివాస్, ఓదేలు ,సిఆర్పి తిరుపతి పాల్గొన్నారు.
