Students Evidence | మెనూ తెలీదు
- కోడిగుడ్డు లేదు
- స్వీటు ఇవ్వటం లేదు
- అసలు అన్నం చాలటం లేదు
- ఇదీ స్టువర్టుపురం పిల్లల ఆన్సర్
- ఎమ్మెల్యే అవాక్కు
- ప్రిన్సిపాల్ పై ఆగ్రహం
Students Evidence | (బాపట్ల రూరల్, ఆంధ్రప్రభ) : సీఎం ఆదేశాలను పట్టించుకోకుండా విద్యార్థుల (Students) సంరక్షణ పై నిర్లక్ష్యాన్ని చూపుతున్న గిరిజన పాఠశాల ప్రిన్సిపాల్ సోమయ్య పై ఎమ్మెల్యే నరేంద్ర వర్మ రాజు ఆగ్రహించారు. మండలంలోని స్టువర్టు పురం గ్రామంలో ఏపీ గిరిజన సంక్షేమ పాఠశాలలో ఎమ్మెల్యే నరేంద్ర వర్మ రాజు ఆకస్మిక తనిఖీ చేశారు. తనిఖీల్లో వసతులపై ఎమ్మెల్యే నరేంద్ర వర్మ రాజు విద్యార్థుల నుంచి ఆరా తీశారు. మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా అని అడిగారు. మెనూ ప్రకారం భోజనం అందించడం లేదని ఎమ్మెల్యేకు విద్యార్థులు ఫిర్యాదు చేశారు.

రోజు కోడిగుడ్డు పెట్టడం లేదని, ఇప్పటివరకు భోజనంలో స్వీటు అనేది వడ్డించలేదని, చాలీచాలని భోజనం (Food) పెడుతున్నారని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నరేంద్ర వర్మ రాజు ప్రిన్సిపల్ సోమయ్య వివరణ అడిగారు. సమాధానం లేకుండా మౌనంగా ఉండటంతో ఎమ్మెల్యే ప్రిన్సిపాల్ సోమయ్య తీరుపై అసహనం వ్యక్తం చేశారు. చిన్నపిల్లలకు నాణ్యమైన భోజనం అందించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేసిన పట్టించుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

నాణ్యమైన ఆహారం విద్యార్థులకు అందించడంలో ఉద్యోగులు విఫలమయ్యారని విచారం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే (Mla) వేగేశన నరేంద్ర వర్మ రాజు మాట్లాడుతూ గిరిజన పాఠశాల ప్రిన్సిపల్ సోమయ్య పై కలెక్టర్ వినోద్ కుమార్ కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. చిన్న పిల్లలకు స్నాక్స్ స్వీట్ రాగి లడ్డు అసలు పెట్టడం లేదని మిగిలిన ఆహారం చాలీచాలకుండా పెడుతున్నారని వీరిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లను ఉన్నట్లు తెలియజేశారు.

