students | మరుగుదొడ్ల నిర్మాణానికి భూమి పూజ

students | మరుగుదొడ్ల నిర్మాణానికి భూమి పూజ

students | జైనూర్, ఆంధ్రప్రభ : కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలోని జెండగూడ గ్రామపంచాయతీ లోని అలీగూడ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల సౌకర్యార్థం రూ.2 లక్షలతో మంజూరు అయిన మరుగుదొడ్ల నిర్మాణానికి మంగళవారం జెండగూడ సర్పంచ్ ఉయిక చందన్ షావ్ భూమి పూజ చేశారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ చందన్ షావ్ మాట్లాడుతూ, విద్యార్థుల ఆరోగ్యం, పరిశుభ్రత దృష్ట్యా మరుగుదొడ్ల అవసరం ఎంతో ముఖ్యమని, ఇవి విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణతో పాటు విద్యాభివృద్ధికిదోహదపడతాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో జైనూర్ డివిజన్ పంచాయతీ రాజ్ డిఈ ఫ జల్హాక్, అసిస్టెంట్ బాబూలాల్ జెండగూడ ఉపసర్పంచ్ ఎస్.కే. ఆజమ్, గ్రామస్థులు యాదోరావు, మాణిక్ రావు, గోవింద్ రావు గ్రామపంచాయతీ సభ్యులు, ఉపాధ్యాయులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Leave a Reply