Students | పిల్లలకు చదువే ఆస్తి
- విద్యార్థుల ఎదుగుదలకు తల్లిదండ్రులే తొలి గురువులు
- పుట్టపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి
Students | శ్రీ సత్యసాయి బ్యూరో, ఆంధ్రప్రభ : విద్యార్థులకు విద్యే శాశ్వత ఆస్తి అని పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి అన్నారు. సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజవర్గం పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలోని బీడుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో (School) శుక్రవారం నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎమ్మెల్యే తోపాటు మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి, విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో విద్యాభివృద్ధికి కూటమి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని ఎమ్మెల్యే (MLA) అన్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రత్యేక చొరవతో రాష్ట్రంలో 65 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాలో తల్లికి వందనం పథకం ద్వారా రూ.87 వేల కోట్లు నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. జీవితంలో పిల్లలు సక్రమమైన మార్గంలో పయనించడానికి వారి తల్లిదండ్రులే తొలి గురువులని అన్నారు. అనంతరం పాఠశాలలో అత్యంత ప్రతిభ చూపిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ కమిటీ అధ్యక్షులు లక్ష్మీనారాయణ , వైస్ చైర్మన్ రాధ, ప్రధానోపాధ్యాయులు గోపాల్ నాయక్ , ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.

