Student | ఎవరూ లేని సమయంలో..

Student | ఎవరూ లేని సమయంలో..
Student | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : పదవ తరగతి చదువుతున్న విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏలూరు జిల్లా, పెదవేగి గురుకుల పాఠశాలలో చోటుచేసుకుంది. విద్యార్థి ఈపిచర్ల అజిత్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. హాస్టల్ గదిలో ఎవరూ లేని సమయంలో ఈ ఘటన జరిగినట్లు పాఠశాల సిబ్బంది తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఏలూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, తల్లిదండ్రులకు సమాచారం అందించారు. అయితే మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు ఈ ఘటనపై అనుమానాలు వ్యక్తం చేశారు.
