Student Counseling | విద్యార్థులు సన్మార్గంలో పయనించాలి

Student Counseling | విద్యార్థులు సన్మార్గంలో పయనించాలి

  • ఎస్సై సందీప్

Student Counseling | భీమ్‌గల్ టౌన్, ఆంధ్రప్రభ : విద్య‌నభ్యసించే విద్యార్థినీ, విద్యార్థులు చెడు వ్యసనాలకు లోను కాకుండా సన్మార్గంలో నడవాలని భీమ్ గల్ ఎస్సై సందీప్ సూచించారు. ఈ రోజు గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో పోలీస్ కళా బృందంచే పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన స్టూడెంట్స్ కౌన్సిలింగ్(Student Counseling) కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.

జాతీయ భద్రత, సైబర్ క్రైమ్, మూఢ నమ్మకాలు, మత్తు పదార్థాలు, రోడ్డు ప్రమాదాలు, సెల్ ఫోన్ వినియోగం(cell phone use) పై విద్యార్థులకు అవగాహన కలుగజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అత్యంత కీలకమైన విద్యార్ధి దశలో విద్యార్థులు నేరాలు చేయకూడదని, మంచి ఏదో చెడేదో ఆలోచించి ముందుకు సాగాలన్నారు.

విద్యార్థులు మత్తు పదార్థాల జోలికి పోవద్దని వాటికి బానిసలైతే జీవితం నాశనం అవుతుందన్నారు. ఆన్ లైన్ గేమ్స్(online games) కు అలవాటు పడొద్దని వాటివల్ల ఆర్థిక సమస్యలను కొని తెచ్చుకొన్నట్లేనన్నారు. సైబర్ నేరాలకు దూరంగా ఉండాలని, ట్రాఫిక్ రూల్స్ పాటించాలన్నారు. బైక్, కార్లను వేగంగా నడపవద్దని, హెల్మెట్(helmet) విధిగా ధరించాలని ట్రిపుల్ డ్రైవ్ నేరమన్నారు.

ఈ కార్యక్రమంలో కాలేజీ ప్రిన్సిపాల్ సి. జైపాల్ రెడ్డి, స్టూడెంట్స్ కౌన్సిలర్లు డాక్టర్. మండలోజీ నర్సింహా స్వామి, పల్లె శ్రీనివాస్ గౌడ్, ఏఆర్ ఎస్సై శ్రీనివాస్, కానిస్టేబుళ్లు లక్ష్మయ్య, విక్రమ్,కాలేజీ స్టాఫ్, విద్యార్థిని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply