Student | జాతీయ స్థాయి నృత్య పోటీలకు…

Student | జాతీయ స్థాయి నృత్య పోటీలకు…

ఎంపికైన విద్యార్థిని సూహీర

Student | పరకాల, ఆంధ్రప్రభ : పరకాల పట్టణంలోని శారద విద్యాలయం విద్యార్థిని జాతీయస్థాయి నృత్య పోటీలకు ఎంపికయ్యారు. ఆడిటోరియంలో స్పోర్ట్స్ ఆద్వర్యంలో లాల్ బహదూర్ కళాశాల ఆద్వర్యంలో మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ కళా ఉత్సవ్ -2025 జిల్లా స్థాయి నృత్య ప్రదర్శనలో పరకాల పట్టణానికి చెందిన శారదా విద్యాలయంలో 6వ తరగతి చదువుతున్న ఏకు సుహీర పాల్గొని తన నృత్య ప్రదర్శనలో బంగారు పతాకాన్ని సాధించి, మహారాష్ట్రలో జరగనున్న జాతీయ స్థాయికి ఎంపికయ్యారు.

డ్యాన్స్ మాస్టర్ ఏకు నరేష్ విద్యార్థినిని శాలువాతో శారదా విద్యాలయ డైరెక్టర్, పిన్సిపాల్ మార్క సత్యనారాయణ, ఇంచార్జ్ సంతోష్ తో పాటు ఉపాధ్యాయులందరూ శాలువాలతో, మెమోంటోలతో సత్కరించి అభినందించారు. చదువుతో పాటు విద్యార్థులను అన్ని రంగాల్లో ప్రోత్సహిస్తున్న డైరెక్టర్, ప్రిన్సిపాల్ కు ఏకు సుహీరా తండ్రి ఏకు సురేష్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Leave a Reply