Stubborn tiger | జిట్ట పులి దాడిలో.. లేగ దూడ మృతి..

Stubborn tiger | సిరికొండ, ఆంధ్రప్రభ : నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం తూంపల్లి గ్రామ పరిధిలోని కొత్త తిరుపతి ఆడవుల్లో మంగళవారం రాత్రి జిట్ట లేగ‌దూడ‌పై దాడి చేసి హతమార్చినట్లు ఇంచార్జి ఎఫ్ఆర్ఓ బి.రవీందర్ బుధవారం తెలిపారు. ఎఫ్ఆర్ఓ అందించిన వివరాల ప్రకారం… సిరిసిల్ల రిజర్వు ఫారెస్ట్ తిరుపతి గుట్ట బీట్ కంపార్ట్ మెంట్ నంబర్ 500 పరిధిలో ఇవాళ‌ సాయంత్రం లేగ దూడపై జిట్ట పులి దాడి చేసిన విషయాన్ని ధూప్య నాయక్ తాండ నివాసి లేగ దూడ యజమాని మాలావత్ రఘుపతి ఇచ్చిన సమాచారం మేరకు…. లేగ దూడను జిట్ట పులి హతమార్చిన ప్రాంతానికి వెళ్లి పరిశీలించినట్లు ఆయన చెప్పారు.

వెటర్నరీ డాక్టర్ అభిషేక్ ను తీసుకువెళ్లి జిట్ట పులి దాడిలో మృతిచెందిన లేగదూడకు పంచనామా చేయించినట్లు ఆయన పేర్కొన్నారు. పంచనామా అనంతరం మృతి చెందిన లేగ దూడ రూ. 30000 విలువ గలదని వెటర్నరీ డాక్టర్ నిర్ధారించిన ధ్రువపత్రాన్ని అందించినట్లు ఎఫ్ఆర్వో వివరించారు. ఈ విషయాన్ని డీఎఫ్ఓకు వివరించి లేగ దూడను కోల్పోయిన యజమాని మాలావత్ రఘుపతికి నష్ట పరిహారం ఇప్పిస్తామని ఎఫ్ఆర్ఓ తెలిపారు.

Leave a Reply