Strong room | ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి

Strong room | ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి

Strong room | చెన్నూర్, ఆంధ్రప్రభ : భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ఓటు హక్కు కల్గిన ప్రతి ఒక్కరు సద్వినయోగం చేసుకోవాలని మంచిర్యాల డీసీపీ ఏ భాస్కర్ కోరారు. చెన్నూరు (కిష్టంపేట )ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన ఎన్నికల స్ట్రాంగ్ రూమ్(Strong room)ను మంచిర్యాల డిసిపీ సందర్శించారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మూడోవిడత ఎన్నికల్లో భాగంగా చెన్నూరు నియోజక వర్గంలోని ఐదు మండలాలకు గాను 102 గ్రామపంచాయతీలకు బుధవారం ఎన్నికల పోలింగ్ కేంద్రాల(polling stations)లో జరుగనున్న దృశ్య ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కల్గకుండా ప్రశాంతవాతావరణంలో ప్రజలు తమతమ ఓటు హక్కును వినియోగించుకొనే విధంగా పోలీసు సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. సమస్యత్మాకంగా ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు డీసీపీ పేర్కొన్నారు.

Leave a Reply