ఇద్దరు మహిళా బీట్ ఆఫీసర్లకు.. ఫారెస్టు సెక్షన్ ఆఫీసర్లుగా పదోన్నతి..

ఇద్దరు మహిళా బీట్ ఆఫీసర్లకు.. ఫారెస్టు సెక్షన్ ఆఫీసర్లుగా పదోన్నతి..

జన్నారం, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా జన్నారం అటవీ డివిజనల్ పరిధిలోని ఇద్దరు మహిళ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లకు సెక్షన్ ఆఫీసర్లుగా పదోన్నతి సీసీఎఫ్ కల్పించారు. ఈ మేరకు సోమవారం సాయంత్రం కాలేశ్వరం జోన్ సీసీఎఫ్ బి.ప్రభాకర్ పదోన్నతి ఆదేశాలు జారీ చేశారు. జన్నారం అటవీ డివిజన్లోని గోండుగూడ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ జె.లాల్బాయ్ కి కాగజ్ నగర్ డివిజన్లోని కర్జలి రేంజ్ లో స్పెషల్ డ్యూటీ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసరుగా పోస్టింగ్ ఇచ్చారు.

ఇదే డివిజన్లోని ఇందనపల్లి రేంజ్ లోని భర్తన్ పేట ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ రూబీనతలత్ కు డివిజన్లోని జన్నారం రేంజ్ స్ట్రైకింగ్ ఫోర్స్ ఫారెస్టు సెక్షన్ ఆఫీసరుగా పోస్టింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,మూడు రోజుల్లో రిలీవై,కొత్త పోస్టుల్లో విధుల్లో చేరుకున్నట్లు వారు తెలిపారు.

Leave a Reply