190 people | పోలీసుల కఠిన చర్యలు

190 people | పోలీసుల కఠిన చర్యలు
- పరీక్షల్లో షాకింగ్ ఫలితాలు.. 190 మందికి గంజాయి పాజిటివ్
190 people | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : హైదరాబాద్ నగరంలో రౌడీషీటర్ల ఆగడాలు పెరుగుతున్న నేపథ్యంలో పోలీసులు కీలక చర్యలు చేపడుతున్నారు. డ్రగ్స్ వినియోగాన్ని అరికట్టేందుకు రౌడీషీటర్లకు డ్రగ్ టెస్టులు నిర్వహిస్తున్నారు.
హైదరాబాద్ కమిషరేట్ పరిధిలో రౌడీషీటర్లపై పోలీసులు కఠిన చర్యలు ప్రారంభించారు. నగరంలో పెరుగుతున్న నేరాల నేపథ్యంలో డ్రగ్స్ వినియోగాన్ని నియంత్రించేందుకు ఇవాళ రౌడీషీటర్లకు డ్రగ్ టెస్టులు నిర్వహిస్తున్నారు.
పోలీసుల అంచనా ప్రకారం… ప్రస్తుతం నగరంలో 1,300 మందికి పైగా రౌడీషీటర్లున్నారు. వీరిలో ఇప్పటికే 250మందికిపైగా పరీక్షలు నిర్వహించగా, 190 మందికి గంజాయి వినియోగం పాజిటివ్‌గా తేలినట్లు సమాచారం.
ఈ ఫలితాలు పోలీసులను అప్రమత్తం చేశాయి. డ్రగ్స్ కారణంగా నేరాలు పెరుగుతున్నాయని భావించిన అధికారులు, రౌడీషీటర్లపై మరింత నిఘా పెంచాలని నిర్ణయించారు. నగరంలో శాంతి భద్రతలను కాపాడేందుకు, నేరాలను అరికట్టేందుకు ఇలాంటి చర్యలను కొనసాగిస్తామని పోలీసులు స్పష్టం చేశారు.
