street lights | ఆశీర్వదిస్తే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా

street lights | ఆశీర్వదిస్తే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా

-మాటేడు గ్రామ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కలువకొలను దినేష్ రాజు

street lights | తొర్రూరు, ఆంధ్రప్రభ : ఈ నెల 14న జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో తనను ఆశీర్వదించి సర్పంచ్ గా గెలిపిస్తే మాటేడు గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని మాటేడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కలువకొలను దినేష్ రాజు అన్నారు.

ఈ రోజు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఇంటింటా ప్రచారం(Door-to-door promotion) నిర్వహించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దినేష్ రాజు మాట్లాడుతూ తాను నెలకు 1 లక్ష రూపాయల ఉద్యోగాన్ని వదిలి గత 4 సంవత్సరాల నుంచి గ్రామస్తులకు సేవలందిస్తున్నానని తెలిపారు.

గ్రామంలో పేద ప్రజలకు అండగా నిలుస్తున్నట్లు తెలిపారు. గ్రామంలో చనిపోయిన పేద కుటుంబాలకు బియ్యం అందజేస్తున్నట్లు తెలిపారు. గ్రామంలో ప్రతి సంవత్సరం వినాయక విగ్రహాలు(Ganesha idols) అందించి ప్రతి వినాయక విగ్రహాల వద్ద మహా అన్నదాన కార్యక్రమాలను చేసినట్లు తెలిపారు.

గ్రామంలో బతుకమ్మ ఘాట్ నిర్మాణం చేపట్టానని, వేణుగోపాలస్వామి ఆలయంలో వినాయక విగ్రహ ప్రతిష్టాపన చేయించినట్లు తెలిపారు. జరగబోయే సర్పంచ్ ఎన్నికల్లో తనను గెలిపిస్తే పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, టీపీసీసీ ఝాన్సీ రెడ్డి(TPCC Jhansi Reddy)ల సహకారంతో గ్రామంలో వేణుగోపాలస్వామి, శివాలయాలను పున: ప్రతిష్టాపన చేయిస్తానన్నారు. గ్రామంలో అన్ని వీధులలో వీధిలైట్లు(street lights), డ్రైనేజీ, సిసి రోడ్లు,మురికి కాలువలు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు.

ఉంగరం గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఇన్చార్జి సర్వి వెంకన్న, నాయకులు లేగల నరసింహారెడ్డి, మహంకాల యాకయ్య, మహంకాల దేవేందర్, ఆకుల ప్రశాంత్, బొల్లం రాములు, బుర్ర సురేష్, గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు యూత్,మహిళ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply