Street Lights | “పగలే వెలుగు… రాత్రి చీకటే!”

Street Lights | “పగలే వెలుగు… రాత్రి చీకటే!”

Street Lights | పరకాల, ఆంధ్రప్రభ : పట్టణంలోని మున్సిపల్ వీధి లైట్లు పట్టపగలే వెలుగుతాయి, రాత్రిపూట వెలగడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హనుమకొండ (Hanumakonda) జిల్లా పరకాల పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్ ఎదురుగా ఉన్న రాజపేట కాలనీలో మున్సిపల్ వీధిలైట్లు పట్టపగలే వెలగడం జరుగుతుంది. ఈ విధంగా వీధిలైట్లు (Street Lights) పట్టపగలు వెలగడం కొన్ని నెలలపాటు నుండి జరుగుతుందని స్థానికులు అంటున్నారు. పట్టపగలు వెలుగుతున్న స్ట్రీట్ లైట్ల వల్ల అదనపు కరెంటు బిల్లు మున్సిపల్ శాఖకు వస్తుంది.

ఈ నిర్లక్ష్యం వల్ల విద్యుత్ శాఖ (Electricity Department) కు మున్సిపల్ శాఖ అదనపు కరెంటు బిల్లు చెల్లించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని పలువురు అంటున్నారు. మున్సిపల్ అధికారుల పర్యవేక్షణ లోపంతో మున్సిపల్ సిబ్బంది ఇష్టానుసారంగా వ్యవహరించడం వల్ల వీధిలైట్లు (Street Lights) పట్ట పగలు వెలగడానికి కారణం అవుతుందని పలువురు అంటున్నారు. అదేవిధంగా పట్టణంలోని కొన్నిచోట్ల రాత్రి వేళల్లో వీధిలైట్లు వెలగడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు సిబ్బంది పనితీరుపై పర్యవేక్షణ చేయాలని ప్రజలు కోరుతున్నారు.

Leave a Reply