ట్రంప్ అదనపు సుంకాల ఎఫెక్ట్‌..

ఆంధ్ర‌ప్ర‌భ‌, వెబ్ డెస్క్: ట్రంప్ అదనపు సుంకాల (Tariffs on India) ప్రభావంతో దేశీయ మార్కెట్లు భారీగా నష్టపోయాయి (Stock Market Today). అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు రావడంతో సెన్సెక్స్(Sensex) 600 పాయింట్లు నష్టపోయి 81,036 వద్ద, నిఫ్టీ 181 పాయింట్లు క్షీణించి 24,788 వద్ద ట్రేడవుతున్నాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 87.83గా ఉంది.

రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందున భారత్‌పై డొనాల్డ్ ట్రంప్ విధించిన అదనపు సుంకాలు (Trump Tariffs) ఆగస్టు 27న ఉదయం 10 గంటల నుంచి అమల్లోకి రానున్నాయి. దీనిపై అమెరికా న్యూదిల్లీకి అధికారికంగా నోటీసులు పంపింది. ఈ సమయం తర్వాత అమెరికాలోకి ప్రవేశించే భారతీయ ఉత్పత్తులకు ఈ సుంకాలు వర్తిస్తాయి.

నిన్న అమెరికా మార్కెట్లు నష్టాల్లో ముగియగా.. నేటి ట్రేడింగ్‌లో ఆసియా మార్కెట్లపైనా ఆ ప్రభావం కనిపిస్తోంది. ఫెడ్ గవర్నర్ లిసా కుక్‌ను ట్రంప్ తొలగించడం కూడా మార్కెట్ల నష్టాలకు మరో కారణం. నిఫ్టీలో బజాజ్ ఆటో, హెచ్‌యూఎల్, హీరో మోటార్‌కార్ప్ షేర్లు లాభాల్లో ఉండగా, టాటా స్టీల్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఐసీఐసీఐ బ్యాంక్, టాటా మోటార్స్, సిప్లా స్టాక్స్ నష్టాల్లో ఉన్నాయి.

Leave a Reply