Stock Market | నష్టాలతో ప్రారంభమైన షేర్ మార్కెట్
ముంబయి – దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:26 సమయానికి నిఫ్టీ 96 పాయింట్లు నష్టపోయి 22,852కు చేరింది. సెన్సెక్స్ 322 పాయింట్లు దిగజారి 75,653 వద్ద ట్రేడవుతోంది.
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం నష్టాల్లో ట్రేడింగ్ మొదలుపెట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లో మిశ్రమ సంకేతాల నడుమ సూచీలు ఒడుదొడుకులకు లోనవుతున్నాయి.
ముఖ్యంగా ఇన్ఫోసిస్, టీసీఎస్, సన్‌ఫార్మా, ఎంఅండ్‌ఎం వంటి ప్రధాన షేర్లలో విక్రయాలు సూచీలపై ఒత్తిడి పెంచుతున్నాయి. దీంతో సూచీలు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
సన్‌ఫార్మా, ఎంఅండ్‌ఎం, టీసీఎస్, టెక్‌మహీంద్రా, అదానీ పోర్ట్స్, ఐసీఐసీఐ బ్యాంక్, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, భారతీ ఎయిర్‌టెల్, హెచ్‌యూఎల్, ఇన్ఫోసిస్, నెస్లే ఇండియా షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఎన్టీపీసీ, టాటా స్టీల్, టాటా మోటార్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఎస్‌బీఐ, ఎల్అండ్‌టీ, అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు లాభాల్లో కదలాడుతున్నాయి.