Statue installation | ముదిరాజ్ సంఘం ద్వారా రూ.4 లక్షలు అందజేత

Statue installation | మక్తల్, ఆంధ్రప్రభ : చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ప్రతిష్టాపన కోసం రూ.4 లక్షలు ముదిరాజ్ సంఘం ద్వారా శివాజీ యువజన సంఘానికి అందజేశారు. నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలోని చిట్యాల గ్రామంలో శివాజీ యూత్ ఆధ్వర్యంలో శివాజీ విగ్రహ ప్రతిష్టాపన ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా చిట్యాల గ్రామ ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో తమ వంతుగా 4 లక్షల రూపాయల నగదును ఇవాళ శివాజీ యూత్ సభ్యులకు సంఘం సభ్యులు మాజీ సర్పంచ్ బి.నర్సిములు, ఉల్లా లక్ష్మణ్, మాజీ ఎంపిటిసి రామలింగప్ప అందజేశారు.

విగ్రహ ప్రతిష్టాపన వేడుకలను త్వరగా పూర్తి చేయాలని, అవసరమైతే మరికొంత ఆర్థిక సాయం అందిస్తామని ముదిరాజ్ సంఘం సభ్యులు భరోసా ఇచ్చారు. విగ్రహ ప్రతిష్టాపనకు ముందుకొచ్చిన యువతను వారు అభినందించారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం పెద్దలు కావలి పెద్ద రాములు, ముడుమల్ లింగప్ప, దుకాణం తమలప్ప, పంది రామలింగప్ప, సింహాద్రి, పుల్లారి శ్రీనివాసులు, పుల్లారి వెంకటేష్, నాగేష్, బి, వెంకటేష్, సి.దత్తు, వాకిటి నరసింహులు, గొర్రె కండ్ల వెంకటయ్య, శివాజీ యువజన సంఘం అధ్యక్షులు పుల్లారి అంజి, ఉపాధ్యక్షులు ఇంటెనికి నరసింహ, ప్రధాన కార్యదర్శి బాలరాజ్, కోశాధికారి లక్ష్మీపురం రంగప్ప, కార్యదర్శులు చాకలి అనిల్, పంది అంజప్ప, పుల్లారి పరుశురాం, బి.రాము, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply