జగ్గయ్యపేటలో 10వ తరగతి విద్యార్థులకు ప్యాడ్స్, పెన్స్ పంపిణి

జగ్గయ్యపేటలో 10వ తరగతి విద్యార్థులకు ప్యాడ్స్, పెన్స్ పంపిణి
రేగొండ, ఆంధ్రప్రభ: జయశంకర్ భూపాలపల్లి జిల్లా గోరి కొత్తపల్లి మండలంలోని జగ్గయ్యపేట ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు ఒంటేరు చంద్రశేఖర్ ఆధ్వర్యంలో పాఠశాలలోని 2025-26 విద్య సంవత్సరo 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు 14 మార్చి నుంచి వ్రాయు విద్యార్థులకు అందరికీ జగ్గయ్యపేట పాఠశాలలో పనిచేస్తున్న పరాంకుశం వేంకట గిరిధర కృష్ణ (యస్ ఎ ఇంగ్లీషు, పరాంకుశం శిరీష (యస్ ఎ గణితము) బోధిస్తున్న ఉపాధ్యాయులు విద్యార్థులకు పరీక్షలు రాయడానికి ఉపయోగించే పరిక్ష ప్యాడ్, 4 పెన్నులు, పెన్సిల్, స్కేల్, ఇతరత్ర వస్తువులు ఇచ్చి విద్యార్థులను ప్రోత్సహించడం జరిగింది.
ఈ సందర్భంగా ఉపాధ్యాయులు ఇరువురికి పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థుల అందరి తరుపున హృదయ పూర్వకంగా కృతజ్ఞతలు తెలిపారు.ఈకార్యక్రమంలో.ప్రధానోపాధ్యాయులు. ఒంటేరు చంద్రశేఖర్, ఉపాధ్యాయులు పి.వి.గిరిధర కృష్ణ, రాజేందర్, చక్రధర్ రావు,తంగల్లపల్లి కుమారస్వామి, శ్రీధర్, కోటిలింగం, మహేందర్, శిరీష, శ్రీనివాస్, కల్పనా కుమారీ, మాధవి, ప్రతాప్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
