Reach2home | స్టేషన్ ఘన్‌పూర్‌లో అరైవ్ అలైవ్ రోడ్ సేఫ్టీ కార్యక్రమం

Reach2home | స్టేషన్ ఘన్‌పూర్‌లో అరైవ్ అలైవ్ రోడ్ సేఫ్టీ కార్యక్రమం

Reach2home | సీట్‌బెల్ట్ ధరించిన డ్రైవర్లకు రోజా పువ్వులతో సత్కారం
“ఒక్క నిర్లక్ష్యం ఒక కుటుంబాన్ని రోడ్డుపాల చేస్తుంది” – సీఐ వేణు
హెల్మెట్, సీట్‌బెల్ట్ వాడకం ప్రాణాలను కాపాడుతుంది
విద్యార్థులు రోడ్డు భద్రత అంబాసిడర్లుగా మారాలి
రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యం

స్టేషన్ ఘన్‌పూర్, ఆంధ్రప్రభ : ప్రయాణానికి ముందు ఒక్కసారి మీ కుటుంబం గురించి ఆలోచించండి. మీ కోసం మీ కుటుంబం ఎదురు చూస్తుంది. ఒక్క నిర్లక్ష్యం..ఒక కుటుం బాన్ని రోడ్డుపాల చేస్తుంది. వేగం, అజాగ్రత్త వల్ల జరిగే ప్రమాదాలు క్షణా ల్లో జీవితాలను మార్చేస్తాయి..జాగ్రత్తగా వాహనం నడిపితేనే మనం సురక్షితంగా ఇంటికి చేరగలుగుతాం. శిక్షలు విధించడం మాత్రమే మా లక్ష్యం కాదు…ప్రతి ఒక్కరూ సురక్షితం గా ఇంటికి చేరుకోవడమే మా లక్ష్యమని సీఐ జి. వేణు స్పష్టం చేశారు.

రోడ్డు ప్రమాదాలను తగ్గించడ మే లక్ష్యంగా వరంగల్ పోలీస్ కమిషన రేట్ వ్యాప్తంగా రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాలు నిర్వహి స్తున్నారు. ఇందులో భాగంగా గురు వారం ఘన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలోని జాతీయ రహదారిపై సీఐ జీ. వేణు ఆధ్వర్యంలో వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనలపై అరైవ్‌, అలైవ్‌ పేరుతో ప్రత్యేక రోడ్ సేఫ్టీ అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

సీట్‌బెల్ట్ ధరించడం వల్ల ప్రాణాపాయం తగ్గుతుందని, ప్రతి ఒక్కరూ రోడ్డు నిబంధనలు తప్పని సరిగా పాటించాలని సూచించారు. సురక్షి తంగా ప్రయాణించండి.. సురక్షితంగా చేరుకోండి అనే నినాదంతో వాహ నదారులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో భాగంగా జాతీ య రహదారిపై సీట్‌బెల్ట్ ధరించి వాహనం నడిపిస్తున్న డ్రైవర్లను గుర్తిం చి వారికి రోజా పువ్వులు అందించి అభినందించారు.

హెల్మెట్, సీట్‌బెల్ట్ వాడకం ప్రాణాలను కాపాడుతుంది : సీఐ వేణు

వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి. హెల్మె ట్‌, సీట్‌బెల్ట్ ధరించాలని సీఐ వేణు సూచించారు. రోడ్డు ప్రమాదాలలో ఒక్క ప్రాణం కూడా కోల్పోకుండా ప్రతి ఒక్కరూ సురక్షితంగా గమ్యానికి చేరుకోవ డమే రాష్ట్ర పోలీస్ శాఖ అరైవ్‌, అలైవ్‌ కార్యక్రమం లక్ష్యమ న్నారు. రోడ్డు ప్రమాదం అనేది ఒక కుటుంబం రోడ్డు పాలవడమే నని, ప్రమాదాలను నివారించాలంటే అవగాహనతో పాటు ముందస్తు జాగ్రత్త లే మార్గమని తెలిపారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. రోడ్డు ప్రమాదాల నివారణలో విద్యార్థులు అంబాసిడర్లుగా మారి తమ తల్లిదండ్రులు, చుట్టుపక్కల ప్రజలు, పెద్దలు, నిరక్షరాస్యులను చైతన్య వంతం చేయాల్సిన బాధ్యత ఉందని పేర్కొన్నారు.

Reach2home
Reach2home

పిల్లలు వాహనాలు నడపకూడదని స్పష్టం చేశారు. వాహనాలు నడిపేటప్పుడు తల్లిదండ్రు లు, పెద్దలు తప్పనిసరిగా హెల్మెట్ ఉపయోగించేలా వారికి తెలియజేయాలని సూచించారు. సీట్‌బెల్ట్ ధరించకుండా వాహనాలు నడిపేవారికి జరిమానాలు విధించడం మాత్రమే కాకుండా, నిబంధనలు పాటించే వారిని అభినందించడం ద్వారా సమాజంలో సానుకూల మార్పు తీసుకురావచ్చని తెలిపారు.ఈ వినూత్న కార్యక్రమాన్ని ప్రజలు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ రాజేష్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply