కారు గుర్తుకు ఓటు వేసి ఆశీర్వదించండి.

కారు గుర్తుకు ఓటు వేసి ఆశీర్వదించండి.
- అభివృద్ధి చేసి చూపించే బాధ్యత నాది
- 12వ వార్డు బిఆర్ఎస్ అభ్యర్థి కూరపాటి కవిత యాదగిరి
స్టేషన్‌ఘన్‌పూర్, ఫిబ్రవరి5 ఆంధ్రప్రభ: స్టేషన్ ఘన్‌పూర్ మున్సిపాలిటీలోని 12వ వార్డు బిఆర్ఎస్ అభ్యర్థి కూరపాటి కవిత యాదగిరి గురువారం వార్డులో కలియతిరుగుతూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ ఎన్నికల్లో తనకు కారు గుర్తు కు ఓటు వేసి ఆశీర్వదించండి.
అభివృద్ధి చేసి చూపిస్తానని వార్డు ప్రజలను కోరారు. అనంతరం అభ్యర్థి మాట్లాడుతూ..వార్డులో తాగు నీరు, డ్రైనే జీ, రహదారులు, పారిశుధ్యం వంటి మౌలిక సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలిపారు.
