జాతీయస్థాయి సీనియర్ సాఫ్ట్ టెన్నిస్ టోర్నీకి రాష్ట్ర జట్లు

జాతీయస్థాయి సీనియర్ సాఫ్ట్ టెన్నిస్ టోర్నీకి రాష్ట్ర జట్లు

విజ‌య‌వాడ, అక్టోబ‌ర్ 31 : జమ్మూ కాశ్మీర్ (Jammu Kashmir) లోని శ్రీనగర్‌లో నవంబర్ 1 నుంచి 6 వరకు జరుగనున్న 22వ జాతీయస్థాయి సీనియర్ సాఫ్ట్ టెన్నిస్ ఛాంపియన్ షిప్ కు ఆంధ్రప్రదేశ్ జట్లు పయనమైనట్లు సాఫ్ట్ టెన్నిస్ అసోసియేషన్ రాష్ట్ర‌ ప్రధాన కార్యదర్శి డి.దిలీప్ కుమార్ తెలిపారు. ఆరు రోజుల పాటు జరిగే ఈ ఛాంపియన్ షిప్ లో ఆంధ్రప్రదేశ్ పురుషుల, మహిళల జట్లు ప్రాతినిత్యం వహిస్తున్నాయని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా జట్టు సభ్యులకు అధ్యక్షులు వి.శ్రీనుబాబు, కోశాధికారి బి.నీరజ, తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ జట్టు (Andhra Pradesh team) సభ్యుల వివరాలు ఇలా ఉన్నాయి. పురుషుల విభాగంలో ఎస్.ఆరోన్ రోనల్ డిన్ హో, భాను ప్రకాష్ (అనంతపురం), ఎస్.విహిత్ (కృష్ణాజిల్లా), ఎమ్.రేవంత్, బి.మురళీ నాగ వెంకట కార్తీక్, పీ.వి.చిన్హాస్, ఎస్.ఈశ్వర హితేష్ (ఎన్టీఆర్ జిల్లా), కె.వంశీ(శ్రీకాకుళం), మహిళల విభాగంలో ఏ.శ్రీ వైశాలి, పీ.జాహ్నవి (ఎన్టీఆర్ జిల్లా), పీ.లావణ్య, ఎమ్.భావన, ఎన్.అనూష, వి.కృష్ణా కీర్తన (కృష్ణాజిల్లా), ఎమ్.మోక్ష, ఎస్.గ్రీహిత (కడప)లు ఎంపికయ్యారు.

Leave a Reply