AP | కార్యకర్తలే బాస్ లు
కష్టపడిన వారికే టీడీపీ పార్టీలో సముచిత స్థానం..
మండల, క్లస్టర్, యూనిట్, గ్రామ బూతు కమిటీలు ప్రజాస్వామ్య బద్ధంగా పనిచేయాలి…
ప్రమాణస్వీకారంలో రాష్ట్ర మైనార్టీ న్యాయశాఖ మంత్రి…
AP | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : టీడీపీ పార్టీ అంటేనే కార్యకర్తల పార్టీ అని, పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం ఈ పార్టీ పనిచేస్తుందని, నిస్వార్థంగా కష్టపడే ప్రతి కార్యకర్తకు, నాయకుడికి పార్టీలో ఎల్లప్పుడూ సముచితమైన స్థానం అధిష్టానం గుర్తిస్తుందని రాష్ట్ర మైనార్టీ న్యాయశాఖ మంత్రి ఎన్ ఎం డి ఫరూక్ (NMD Farooq) పేర్కొన్నారు. పార్టీ అధిష్టానం ఇచ్చిన ఆదేశాల మేరకు గురువారం పార్టీ కార్యాలయంలో నూతనంగా ఏర్పడిన మండల, క్లస్టర్, యూనిట్, గ్రామ, బూత్ కమిటీల ప్రమాణ స్వీకార కార్యక్రమం కార్యక్రమం నిర్వహించారు.
ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఇటీవల టీడీపీ (TDP) అధికారంలోకి రావడానికి పార్టీ అమలు చేసిన క్లస్టర్, యూనిట్, బూత్ వ్యవస్థ కీలక పాత్ర పోషించిందన్నారు. క్షేత్ర స్థాయిలో టీడీపీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఈ వ్యవస్థ చాలా బాగా పని చేసిందన్నారు. పార్టీ కోసం రోజువారీగా కష్టపడిన నిజమైన యోధులు ఇక్కడ ప్రమాణస్వీకారం చేస్తున్నారన్నారు. ఇది కేవలం పదవి కాదు, పార్టీ పట్ల వారి నిబద్ధతకు దక్కిన గౌరవమన్నారు. ఎవరికి పదవులు వచ్చినా, రాకపోయినా ఎవరూ నిరాశ పడకూడదన్నారు . పార్టీలో అందరూ సమానమేనని, రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరికీ తప్పకుండా గుర్తింపు లభిస్తుందన్నారు. మనందరి లక్ష్యం ఒకటే – రాష్ట్రాభివృద్ధి, టీడీపీ పార్టీ బలోపేతం అన్నారు. ప్రతి కార్యకర్త సహకారం పార్టీకి అత్యంత ముఖ్యమని తెలిపారు.కార్యకర్తలందరూ తమ భేదాభిప్రాయాలను పక్కన పెట్టి, రాబోయే స్థానిక ఎన్నికల కోసం సన్నద్ధం కావాలని మంత్రి కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
రాబోయే స్థానిక ఎన్నికల్లో ( local elections) విజయం సాధించాలని పిలుపునిచ్చారు. ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో, ప్రతి బూత్‌లో మన అభ్యర్థులను గెలిపించడానికి అందరూ కలసికట్టుగా, సమన్వయంతో కృషి చేయాలన్నారు. నూతనంగా ఎన్నికైన మండల, క్లస్టర్, యూనిట్, బూత్ కమిటీ సభ్యుల చేత పార్టీ నియమ నిబంధనలకు కట్టుబడి పనిచేస్తామని ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర యువ నాయకులు ఎన్ ఎం డి ఫయాజ్, మాజీ జెడ్పి వైస్ చైర్మన్ కొట్టాల శివ నాగిరెడ్డి , టిడిపి రాష్ట్ర కార్యదర్శి ఏవిఆర్ ప్రసాద్ పలువురు టిడిపి నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


