State level | క్రీడల్లో ప్రతిభ..

State level | క్రీడల్లో ప్రతిభ..
- సత్తాచాటిన ఉట్నూర్ ఐటీడీఏ గిరిజన విద్యార్థులు
- బంగారు పథకం, ఛాంపియన్ షిప్ కైవసం
ఉట్నూర్, ఆంధ్రప్రభ : రాష్ట్రంలోని ఐటీడీఏల వారీగా వరంగల్ జిల్లా ఏటూర్ నాగారంలో ఈనెల 7, 8, 9, తేదీల్లో నిర్వహించిన రాష్ట్రస్థాయి గిరిజన స్పోర్ట్స్ మీట్ క్రీడల్లో ఉట్నూర్ ఐటీడీఏ గిరిజన విద్యార్థులు ప్రతిభ కనబరిచారని ఆదిలాబాద్ జిల్లా గిరిజన క్రీడల అధికారి పార్థసారథి తెలిపారు. వాలీబాల్ క్రీడల్లో అండర్ 17 గర్ల్స్ విభాగంలో బంగారు పతకం సాధించారని, అండర్ 14 బాలుర విభాగంలో కాంస్య పథకం సాధించారన్నారు. వాలీబాల్ పోటీల్లో ఓవరాల్ ఛాంపియన్ సాధించారని పీడీ పార్థసారథి తెలిపారు.
ఆర్చరీ, అథ్లెటిక్స్, కోకో బాలురు అండర్ 17 విభాగంలో మొదటి స్థానం కైవసం చేసుకోవడం జరిగిందన్నారు. వాలీబాల్ కోచ్ కార్తీక్, వాలీబాల్ బాలికల కోచ్ రాథోడ్ రవీందర్, కోట్నాక్ జలపత్ రావు, కోకో కోచ్ శివుడు, టీ మేనేజర్ రాథోడ్ సాగర్, అథ్లెటిక్స్ కోచ్ రాజు పాల్గొన్నారని తెలిపారు. బంగారు పతకాలు సాధించిన క్రీడాకారులకు ఈనెల 12 సోమవారం ఉట్నూర్ ఐటీడీఏ కార్యాలయంలో ఐటీడీఏ పీవో యువరాజ్ చేతుల మీదుగా సన్మానం కార్యక్రమం ఉంటుందని జిల్లా క్రీడల అధికారి, కోచ్‌లు తెలిపారు.
