State Govt | వాసవి మాత ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి

State Govt | వాసవి మాత ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి

State Govt | గన్నవరం, ఆంధ్రప్రభ : వాసవీ మాత ఆత్మార్పణ దినోత్సవంను రాష్ట్ర ప్రభుత్వ పండుగగా అధికారికంగా నిర్వహిస్తుందని గన్నవరం ఎమ్మెల్యే, ఏపీ ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు వెల్లడించారు. విజయవాడ రూరల్ ప్రసాదంపాడు శ్రీ వాసవి సేవా సంఘం ఆధ్వర్యంలో, అలాగే గన్నవరం వాసవి నగర్‌లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి విశ్వరూప (ఆత్మాహుతి) మహోత్సవ కార్యక్రమాలు జరిగాయి.

ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే యార్లగడ్డ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఎమ్మెల్యేకు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వానికి, గన్నవరం నియోజకవర్గ ప్రజలకు అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ఆయన ప్రార్థించారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని శాస్త్రోక్తంగా కుంకుమార్చనలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ, ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవం, అహింసా మూర్తి అయిన వాసవీ మాత నిర్యాణం చెందిన పవిత్ర దినాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారిక పండుగగా నిర్వహిస్తుందని తెలిపారు. ఇది ఆర్యవైశ్య సామాజిక వర్గానికి ప్రభుత్వం ఇచ్చే గొప్ప గౌరవమని ఆయన పేర్కొన్నారు. లోక కళ్యాణం కోసం అమ్మవారు చూపిన మార్గం సమాజానికి ఆదర్శనీయమని అన్నారు. అమ్మవారి కృపా కటాక్షాలు రాష్ట్ర ప్రభుత్వంపై, గన్నవరం నియోజకవర్గ ప్రజలపై నిరంతరం ఉండాలని, ప్రతి ఇంటా సుఖసంతోషాలు వెల్లివిరియాలని ఆయన ఆకాంక్షించారు.

State Govt |

ఈ సందర్భంగా ఆర్యవైశ్య ప్రముఖులు, సేవా సంఘం ప్రతినిధులు ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావును ఘనంగా సత్కరించారు. గన్నవరం ఏయంసి చైర్మన్ గూడవల్లి నరసింహారావు, గన్నవరం మండల తహశీల్దార్ కె. శివయ్య, గన్నవరం మండల టిడిపి అధ్యక్షులు గూడపాటి తులసిమోహన్, గన్నవరం ఉప సర్పంచ్ పాలడుగు నాని , గన్నవరం టౌన్ టిడిపి అధ్యక్షులు జాస్తి శ్రీధర్, టీడీపీ నాయకులు బొప్పన హరికృష్ణ, గుజ్జర్లపూడి బాబురావు, సర్నాల బాలాజీ, కోనేరు పెద్దబాబు, బండి వెంకట్రావు (నాని), నబిగాని కొండయ్య, అద్దేపల్లి సాంబశివరావు, కొల్లా ఆనంద్, ముక్కపాటి చైతన్య, కానూరు యుగంధర్, అడుసుమిల్లి నవీన్, కోనేరు వెంకట నారాయణ, దాసరి శ్వేత, లావణ్య, నూతి సుభాషిణి, తుపాకుల శివలీల, మేకల స్వాతి, కొంగన రవి ,పడమట రంగారావు, నిమ్మకూరి మధు, ఆళ్ల దమయంతి, దేవినేని సోలోచన రాణి, మోర్ల నాగబాబు, మేడేపల్లి సురేష్ మరియు ఆర్యవైశ్య సంఘం సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

State Govt |
State Govt |
State Govt |

Leave a Reply