రాష్ట్ర ఎన్నికల పరిశీలనాధికారి తనిఖీ
నిజాంపేట, ఆంధ్రప్రభ : మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నామినేషన్ ప్రక్రియను రాష్ట్ర ఎన్నికల పరిశీలనాధికారి ఆసం వెంకటేశ్వర్ రెడ్డి, అడిషనల్ కలెక్టర్ నగేష్(Additional Collector Nagesh) తనిఖీ చేశారు. ఈ రోజు నామినేషన్ల స్వీకరణ సెంటర్ ఎన్నికల పోలింగ్ బూత్ లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్థానిక ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో జరగాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాలని అధికారుల(Officers)కు సూచించారు.
ప్రతిరోజూ స్వీకరించిన పత్రాలను భద్రపరిచి సంబంధిత రిజిస్టర్(Register) నమోదు చేయాలని తెలిపారు. పోలింగ్ బూతుల(Polling Booths)ను సందర్శించి ఎన్నికలవేళ ఓటర్లకు ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రాజిరెడ్డి(MPDO Rajireddy), ఏపీవో శ్రీనివాస్, ఇన్చార్జ్ ఎంపీవో వెంకట నరసింహారెడ్డి, రామాయంపేట సీఐ వెంకట్ రాజా గౌడ్, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
