State budget | నాన్ రెవెన్యూ ఆదాయం పెంచాలి…

- ట్రిపుల్ ఇంజన్ సర్కార్‌తో స్వర్ణాంధ్ర..
- మోడీ.. బాబు.. పవన్‌లు ప్రధాన ఇంజన్లు…
- ఏపీ పురోభివృద్ధి లక్ష్యంగా బడ్జెట్…
- సంక్షేమం, అభివృద్ధి సమతుల్యత…
- మైనింగ్, ఇరిగేషన్, విద్యా రంగాల్లో సంస్కరణలు జరగాలి…
- అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఎమ్మెల్యే యలమంచిలి సత్యనారాయణ (సుజనా) చౌదరి…
State budget | ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి దారి చూపేలా రాష్ట్ర బడ్జెట్ రూపొందించబడిందని విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యుడు ఎలమంచలి సత్యనారాయణ చౌదరి ఏపీ అసెంబ్లీలో బడ్జెట్‌పై జరిగిన చర్చ సందర్భంగా పేర్కొన్నారు. ఆర్థిక మంత్రి సుదీర్ఘమైన శ్రమతో రూపొందించిన బడ్జెట్‌ను సభ ముందుకు తీసుకువచ్చారని ప్రశంసించారు. దేశవ్యాప్తంగా డబుల్ ఇంజన్ సర్కార్ అనే భావన ఉన్నప్పటికీ, ఆంధ్రప్రదేశ్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో మూడు పార్టీలు కలిసి పనిచేస్తున్న నేపథ్యంలో దీనిని ట్రిబుల్ ఇంజన్ సర్కార్‌గా అభివర్ణించవచ్చని ఆయన వ్యాఖ్యానించారు.
ఈ బడ్జెట్ స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంగా, రాష్ట్రాన్ని దీర్ఘకాలికంగా ఆర్థికంగా బలపరిచే దిశగా రూపొందించబడిందన్నారు ఈ బడ్జెట్‌లో ఒకవైపు పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తూనే, మరోవైపు మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, ఉద్యోగాల సృష్టికి ప్రాధాన్యత ఇచ్చినట్లు చెప్పారు. సంక్షేమం, అభివృద్ధి, సమతుల్యత అనే మూడు స్తంభాలపై బడ్జెట్ రూపకల్పన జరిగిందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన వైట్ పేపర్‌లో పెండింగ్ బిల్లులు, లెడ్జర్ అకౌంట్స్, పేయబుల్స్, కమిటెడ్ లయబిలిటీస్ వంటి అంశాలు పొందుపరిచిన విషయాన్ని గుర్తు చేశారు.
అయితే అప్పటినుంచి ఇప్పటివరకు ఎంత అభివృద్ధి సాధించామనే విషయాన్ని స్పష్టంగా ప్రజలకు తెలియజేసేలా మరో సమగ్ర నివేదిక అవసరమని సూచించారు. రెవెన్యూ లోటును భర్తీ చేసేందుకు అప్పులు తీసుకోవడం తప్ప మరో మార్గం లేకుండా పరిస్థితి ఏర్పడిందని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో నాన్ రెవెన్యూ ఆదాయాన్ని పెంచేందుకు పెద్ద అవకాశాలున్నాయని చెప్పారు. రాష్ట్ర కార్పొరేషన్ల పనితీరుపై సమగ్ర అధ్యయనం చేసి వాటి ద్వారా ఆదాయం పెంచే మార్గాలు అన్వేషించాలని సూచించారు. అలాగే స్టేట్ సావరిన్ ఫండ్ ఏర్పాటు మంచి పరిణామమని పేర్కొన్నారు.
భూమిని మార్కెట్ విలువ కంటే తక్కువగా వాల్యూయేషన్ చేసి, ఈక్విటీ రూపంలో పెట్టుబడులు పెడితే దీర్ఘకాలంలో రాష్ట్రానికి మంచి లాభాలు వస్తాయని చెప్పారు. మైనింగ్ రంగంలో కూడా రాష్ట్రం తన పూర్తి సామర్థ్యాన్ని వినియోగించుకోవడం లేదని, ప్రస్తుతం ఉన్న మైనింగ్ సామర్థ్యంలో కేవలం 10 శాతం మాత్రమే ఉపయోగంలో ఉందని, మిగిలినది కాంట్రాక్టర్ల చేతుల్లోనే ఉందన్నారు. మైనింగ్ కార్పొరేషన్ ద్వారా ఇంటర్నేషనల్ టెండరింగ్ చేపడితే ఆదాయం గణనీయంగా పెరుగుతుందని సూచించారు.
ఇరిగేషన్ రంగంలో కొత్త ప్రాజెక్టుల కంటే పాత పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడం అత్యవసరమని అన్నారు. ఉత్తరాంధ్ర సహా అనేక ప్రాంతాల్లో దశాబ్దాలుగా పూర్తి కాకుండా ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేస్తే వ్యవసాయ ఉత్పత్తి పెరిగి, రాష్ట్ర జీఎస్డీపీకి నిజమైన విలువ జోడింపవుతుందని చెప్పారు. విద్య రంగంలో కూడా సంస్కరణలు అవసరమని పేర్కొన్నారు. అమ్మదీవెన, తల్లికి వందనం వంటి పథకాల ద్వారా వచ్చే నిధులను ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి అనుసంధానం చేయాలని సూచించారు.
ప్రైవేట్ రంగంలో ఉన్న అనుభవాన్ని ప్రభుత్వ పాఠశాలలకు అన్వయిస్తే నాణ్యత పెరుగుతుందని అన్నారు. బడ్జెట్ అంచనాల ప్రకారం భారీగా అప్పులు ఉన్నాయని, అందులో పెద్ద భాగం వడ్డీ చెల్లింపులకే వెళ్తోందని చెప్పారు. క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ లక్ష్యాలు సూచించిన స్థాయిలో అమలు కావడం లేదని, ఈ పరిస్థితిలో వడ్డీ భారం తగ్గించేందుకు రీషెడ్యూల్‌మెంట్, దీర్ఘకాలిక లోన్లపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు.
State budget | ఎమ్మెల్యేలకు ప్రత్యేక ఫండ్ అవసరం..
ప్రతి నియోజకవర్గంలో దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ఫండ్ ఏర్పాటు చేయాలని పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యుడు యలమంచిలి సత్యనారాయణ(సుజనా) చౌదరి సూచించారు., ఎంపీ లాడ్ ఫండ్స్ తరహాలో ఎమ్మెల్యేలకు కూడా నిధులు కేటాయిస్తే స్థానిక అభివృద్ధికి ఉపయోగపడుతుందని సూచించారు.
రాష్ట్ర అప్పుల భారం ప్రస్తుతం 36 శాతానికి చేరిందని, దీన్ని 20 శాతానికి తగ్గించాలంటే నాన్ రెవెన్యూ ఆదాయం పెంచడం తప్ప మరో మార్గం లేదని స్పష్టం చేశారు. మొత్తంగా ఈ బడ్జెట్ రాష్ట్రాన్ని సంక్షేమం నుంచి స్వయం ఆధారిత అభివృద్ధి దిశగా తీసుకెళ్లే ప్రయత్నంగా ఉందని, అయితే ఆదాయ వనరుల పెంపు, అప్పుల నియంత్రణ, పారదర్శకత ఉంటేనే నిజమైన స్వర్ణాంధ్ర లక్ష్యం సాధ్యమవుతుందని ఎమ్మెల్యే ఎలమంచలి సత్యనారాయణ చౌదరి సభలో విశ్లేషించారు.