• ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పేదలకు న్యాయం చేస్తాం
  • రాష్ట్ర మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి


మక్తల్, జులై 29 (ఆంధ్రప్రభ) : తెలంగాణ (Telangana) లోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పేదలకు న్యాయం చేస్తామని రాష్ట్ర పశుసంవర్ధక, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి (Minister Dr.Vakiti Srihari) అన్నారు. ఇవాళ మధ్యాహ్నం నారాయణ పేట జిల్లా(Narayanapet District) లోని నర్వ మండవ పరిధిలోని పాతర్చేడ్ గ్రామంలో రూ.28 లక్షలతో చేపడుతున్న సీసీ రోడ్ల కు (CC roads) మంత్రి శంకుస్థాపన (Foundation stone laying) పనులు ప్రారంభించారు.

ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ… గత ప్రభుత్వంలో ప్రజలు ప్రశ్నిస్తే వారి గొంతు నొక్కివేసే పరిస్థితి ఉందని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి పౌరుడికి ప్రశ్నించే హక్కును కల్పిస్తోందని పేర్కొన్నారు. గత పాలకులు పాతర్చేడ్ గ్రామాన్ని పూర్తిగా విస్మరించారని, ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కూడా మంజూరు చేయలేదన్నారు.

ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తోందని పేర్కొంటూ.. ఇప్పటికే ఈ గ్రామానికి 20ఇండ్లు మంజూరు చేశామని, వాటిలో ఎస్సీలకు 5ఇండ్లు కేటాయించామని తెలిపారు. అదనంగా మరో 20ఇండ్లను మంజూరు చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల పేదలకు న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని, వారి అభ్యున్నతి కోసం అహర్నిశలు కృషి చేస్తుందని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు జలంధర్ రెడ్డి, పోలీస్ చంద్రశేఖర్ రెడ్డి, జగదభి రెడ్డి, చెన్నయ్య సాగర్, జఖన్ మోహన్ రెడ్డి, వివేకవర్థన్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply