Started | ఉపాధి హామీ పనులు ప్రారంభం…

Started | కెరమేరీ, ఆంధ్రప్రభ : మండలంలోని సావర్ కేడ గ్రామంలో ఉపాధి హామీ పనులను సావర్ కెడ గ్రామ సర్పంచ్ కావుడే తులసిరామ్ ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… జాబ్ కార్డ్ కలిగిన ప్రతి ఒక్కరూ ఉపాధి హామీ పనులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం ఉపాధి హామీ పథకంలో గతంలో100 రోజులు పని దినాలు కల్పించేది కానీ ప్రభుత్వం కొన్ని స్వల్ప మార్పులు చేస్తూ ఉపాధి హామీ పనులను 125 రోజులకు పొడిగించారు. గ్రామ పంచాయతీలోని ప్రతి ఒక్క జాబ్ కార్డ్ కలిగిన కూలీలు పనులను చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టిఏ అరవింద్ ఎఫ్ ఎ చంద్రు కూలీలు పాల్గొన్నారు.

Leave a Reply