ఎస్టీ గురుకుల పాఠశాల విద్యార్థిని ఆత్మహత్యాయత్నం…

  • బాలిక ప‌రిస్థితి విష‌మం..

ఉమ్మడి నల్లగొండ బ్యూరో, ఆంధ్రప్రభ : ఉమ్మడి నల్లగొండ బ్యూరో, ఆంధ్రప్రభ : నల్లగొండ జిల్లా దేవరకొండ పట్టణ శివారులోని ఎస్టీ గురుకుల పాఠశాలలో పదవ తరగతి విద్యార్థిని మౌనిక శుక్రవారం సాయంత్రం ఆత్మహత్యాయత్నం చేసుకుంది. ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది.

హాలియా మండలం తిరుమలగిరి గ్రామానికి చెందిన మౌనిక గురుకుల పాఠశాలలో ఫినాయిల్ సేవించింది. వాంతులతో బాధపడుతుండగా గుర్తించిన పాఠశాల సిబ్బంది… బాలికను దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆమెను 24 గంటలు అబ్జర్వేషన్‌లో ఉంచి పరిశీలిస్తున్నారు.

విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియలేదు. ఈ ఘటనతో గురుకుల పాఠశాలల్లో విద్యార్థుల భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఘటనపై మీడియా ప్రతినిధులు వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నించగా, ప్రిన్సిపల్ మీడియాపై దురుసుగా ప్రవర్తించడం గమనార్హం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Leave a Reply