ఉడుంపూర్లో ఎస్టీ కమిషన్ సభ్యుడి పర్యటన

కడెం, ఆంధ్రప్రభ : కడెం మండలం ఉడుంపూర్ గ్రామాన్ని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోతు హుస్సేన్ నాయక్ సందర్శించారు. ఈ సందర్భంగా కడం మండల బీజేపీ అధ్యక్షుడు కాశవేణి శ్రీనివాస్ యాదవ్, గ్రామ పెద్దలు సంప్రదాయబద్ధంగా గొంగడి వేసి, గొర్రె పిల్లను అందించి ఆయనకు ఘన స్వాగతం పలికారు.
ఈ నేపథ్యంలో ఉడుంపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని పలు గ్రామాల సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. కడం నుంచి కల్లెడ గ్రామం వరకు ప్రతిపాదిత ఎత్తిపోతల పథకాన్ని ఉడుంపూర్ వరకు విస్తరించి నీటి సరఫరా కల్పించాలని కోరారు. అలాగే గండి గోపాల్పూర్ గ్రామానికి త్రిఫేజ్ విద్యుత్ సౌకర్యం అందించాలని, మిద్దెచింత గ్రామానికి విద్యుత్ వసతి కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో ఉట్నూర్ ఐటీడీఏ డీడీ జాదవ్ అంబాజీ, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షురాలు నాగవత్ శారద, గ్రామ పెద్దలు మెంగని శంకరయ్య, మ్యాకల శేఖర్, భూపెల్లి పరంధాములు, దేశినేని బక్కయ్య, చంటి, విజేష్, శారద, విజయ్, మెంగని శ్రీను తదితరులు పాల్గొన్నారు.
