Srisailam | స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు..

Srisailam | స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు..

ఘనంగా శ్రీశైలం పుణ్యక్షేత్రంలో ఉగాది మహోత్సవాలు….
స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు..
కర్ణాటక మహారాష్ట్ర నుంచి అధిక సంఖ్యలో భక్తులు…

Srisailam | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : నంద్యాల జిల్లాలోని జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీశైలంలో వెలిసిన శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానంలో ఉగాది మహోత్సవాలు మూడవరోజు ఘనంగా నిర్వహిస్తున్నారు. స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజ కార్యక్రమాలు చేపట్టారు. శ్రీశైలం కు మహారాష్ట్ర కర్ణాటక తో పాటు ఉమ్మడి రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు. ఈ మూడు రోజులుగా సుమారుగా రెండు లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు.

కాలిబాటను ప్రయాణించే భక్తులకు దేవస్థానం నిర్వాకులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. క్యూ లైన్ లో కూడా భక్తులు అధిక సంఖ్యలో ఉన్నారు. బుధవారం శ్రీశైలంలోని భ్రమరాంబికా మల్లికార్జున స్వామివారి యాగశాలలో చండీశ్వరపూజ, మండపారాధనలు, లోక కల్యాణం కోసం జపానుష్ఠానాలు, రుద్రహోమం నిర్వహించబడ్డాయన్నారు.ఉదయం అమ్మవారియాగశాలలో చండీహోమం జరిపించబడిందన్నారు. ఉత్సవములో భాగంగా అమ్మవారికి విశేషకుంకుమార్చనలు, నవావరణార్చనలు చేయడం జరిగిందన్నారు. సాయంకాల పూజలు, జపానుష్ఠానములు జరిపించబడుతాయన్నారు.

Srisailam |
Srisailam |

Srisailam | స్వామి అమ్మవార్లకు ప్రభోత్సవం..

శ్రీశైలం లో ఉగాదిమహోత్సవాలలో భాగంగా శ్రీస్వామిఅమ్మవార్ల ప్రభోత్సవం వంటి ప్రత్యేక కార్యక్రమం నిర్వహించబడుతుందన్నారు. రథోత్సవంలో రథానికి చేసినట్లుగానే ప్రభోత్సవంలో కూడా ప్రభకు బంతి, చేమంతి, గులాబీ, సుగంధాలు, కనకాంబరాలు మొదలైన 11 రకాల పుష్పాలతో పుష్పాలంకరణ చేయడం జరుగుతుందన్నారు.

Srisailam |
Srisailam |

Srisailam | అమ్మ వారికి నందివాహన సేవలో…

ఉగాది మహోత్సవాలలో నిర్వహించబడే వాహనసేవలలో భాగంగా శ్రీస్వామిఅమ్మవార్లకు నందివాహనసేవ జరిపించబడుతుందన్నారు .ఈ సేవలో శ్రీస్వామిఅమ్మవారి ఉత్సవమూర్తులను నందివాహనంపై వేంచేబు చేయించి ప్రత్యేక పూజాదికాలు నిర్వహించి, తరువాత గ్రామోత్సవం జరిపించబడుతుందన్నారు. నందివాహనాధీశులైన శ్రీస్వామిఅమ్మవార్లను దర్శించడం వలన చేపట్టిన పనులలో విజయం లభిస్తుందని, భోగభాగ్యాలు కలుగుతాయని చెప్పబడుతోందని కార్యనిర్వాహణాధికారి శ్రీనివాసరావు తెలిపారు.

Srisailam | శ్రీశైలంలో భ్రమరాంబిక అమ్మవారికి మహాసరస్వతి అలంకారం…

ఉగాదిమహోత్సవాలలో చేయబడుతున్న అలంకారాలలో భాగంగా ఈ రోజు సాయంకాలం అమ్మవారి ఉత్సవమూర్తిని మహాసరస్వతి స్వరూపంలో అలంకరింపజేయడం జరుగుతుందన్నారు. చతుర్భుజాలు కలిగి ఉండి, వీణ, అక్షమాల పుస్తకాన్ని ధరించిన ఈ దేవిని దర్శించడం వలన విద్యాప్రాప్తితో పాటు అభీష్టాలు సిద్ధిస్తాయని చెప్పబడుతోందన్నారు.

గ్రామోత్సవంలో నాదస్వరం, కోలాటం, చెక్కభజన, రాజభటులవేషాలు, కేరళ చండీమేళం, కొమ్ముకొయ్య నృత్యం, ముంభాయ్ డోల్ థేష్, విళక్కు, స్వాగత నృత్యం, వీరభద్రడోలు కుణిత, జాంజ్ పథక్ కర్ణాటక డోలు కాళికా నృత్యం, జానపద పగటి వేషాలు, నందికోలు సేవ, గొరవనృత్యం, తప్పెటచిందు, బీరప్పడోలు, నందికోలసేవ, ఢమరుకం, చిడతలు, శంఖం, పిల్లనగ్రోవి, డోలు విన్యాసం తదితర కళారూపాలను గ్రామోత్సవంలో ఏర్పాటు చేయబడ్డాయన్నారు.

Srisailam | భక్తులు అగ్నిగుండ ప్రవేశం..

ఉగాది మహోత్సవాలలో భాగంగా శివదీక్షా శిబిరాల వద్ద కన్నడ భక్తులచే అగ్నిగుండ ప్రవేశ కార్యక్రమం నిర్వహింపబడుతుందన్నారు. వీరాచార సంప్రదాయాన్ని అనుసరించి జరిపే ఈ కార్యక్రమానికి ఎంతో ప్రాముఖ్యం ఉందన్నారు. అగ్నిగుండ ప్రవేశానికి ముందు వీరాచార విన్యాసాలు జరుగనున్నాయి. కర్ణాటకకు చెందిన వీరశైవ భక్తులు వీరభద్రవచనాలను పఠిస్తూ, ప్రత్యేక వేషధారణలతో, వివిధ వాయిద్యాల నడుమ విన్యాసాలు చేయనున్నారు. వీరిని పురవంతులు అని పిలుస్తారని పేర్కొన్నారు.

click here to read more : 18thMarch2026 | బుధవారం నేటి పంచాంగం & రాశి ఫలితాలు

click here to read more

Leave a Reply