పెద్దపల్లి, ఆంధ్రప్రభ : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రెటరీ దుద్దిళ్ల శ్రీనుబాబు (Duddilla Srinu Babu) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Chief Minister Revanth Reddy)తో భేటీ అయ్యారు. పిసిసి జనరల్ సెక్రటరీగా నియమించినందుకు సీఎంకు పుష్పగుచ్చం అందించి కృతజ్ఞతలు తెలియజేసారు. తనపై నమ్మకం ఉంచి పిసీసీ లో చోటు కల్పించారని, పార్టీ పటిష్టతకు తన వంతు కృషి చేస్తానన్నారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్తామన్నారు.
TG | సీఎంతో శ్రీనుబాబు భేటీ.. పీసీసీలో చోటు కల్పించినందుకు కృతజ్ఞతలు
