మానవత్వం చాటుకున్న డా. సత్యం

కడెం (నిర్మల్ జిల్లా), ఆంధ్రప్రభ : ఉట్నూర్ మండలంలోని సుధాగూడ గ్రామంలో గల గుండు ఆదివాసి సామాజి వర్గానికి చెందిన నిరుపేదింటి అమ్మాయి పెళ్లి భోజనానికి సరిపడా సామాగ్రి మరియు మూడు క్వింటాల బియ్యం నగదు ఐదువేల రూపాయలు పెళ్లి కుమార్తెకు కావలసిన సామానులన్నీ కొనుగోలు చేసి ఇచ్చి కడెం మండలం నవాబ్ పేట్ సత్యం ట్రెడిషనల్ మెడిసినల్ యోగ ఆశ్రమం నిర్వాహకులు డాక్టర్ రాపల్లి సత్యం గురూజీ ఎల్ హెచ్ పి ఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బాదావత్ శ్రీనివాస్ నాయక్ మానవత్వం చాటుకున్నారు. పరిచయం లేని మనిషికి ఆశించకుండా చేసే సాయమే మానవత్వం మానవత్వం కొందరిలో ఇంకా బతికే ఉందన్న దానికి ఇది ఒక ఉదాహరణగా భావించారు.
గత మూడు రోజుల క్రితం నర్సింగాపూర్ గ్రామానికి చెందిన ఆనందరావు వారు కాల్ చేసి సుధ గూడ గ్రామానికి చెందిన నిరుపేది ఇంటి అమ్మాయి పెళ్లి ఉంది అని చెప్పగా శ్రీనివాస్ నాయక్ డాక్టర్ సత్యం గారు కలిసి ఆ పేదింటి అమ్మాయికి పెళ్లికి కచ్చితంగా సాయం చేస్తా మనీ హామీ ఇచ్చారు ఇచ్చిన మాట ప్రకారం వారికి ఈరోజు పెళ్లికి వచ్చి వధూవరులని ఆశీర్వదించడం జరిగింది. ఇలాంటి సేవా కార్యక్రమాలు రాబోయే రోజుల్లో మాకు తోచినంత సాయం చేస్తామని వారు కొనియాడారు ఇలాంటి సేవా కార్యక్రమాలు ప్రతి ఒక్కోరు చేయాలని వారు కోరారు. ప్రతి ఒక్కరు సేవా భవలతో ముందడుగు వేయాలని వారు చెప్పారు ఇట్టి కార్యక్రమంలో శుద్ధ గూడా గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
