Sridhar Babu | ఆంధ్రప్రభ అంటే ఎంతో మక్కువ…

Sridhar Babu | ఆంధ్రప్రభ అంటే ఎంతో మక్కువ…

  • చిన్ననాటి నుండి చదువుతా
  • డిజిటల్ రంగంలో ముందడుగు
  • ప్రతి నిమిషం తాజా వార్తలు
  • రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు

మంథని, ఆంధ్రప్రభ : రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ఆంధ్రప్రభ పత్రికపై తనకున్న మక్కువను చాటుకున్నారు. బుధవారం రాత్రి పెద్దపల్లి జిల్లా మంథనిలో ఆంధ్రప్రభ 2026 నూతన క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా మంత్రి పత్రికా విలువలను, డిజిటల్ రంగంలో ఆంధ్రప్రభ సాధిస్తున్న ప్రగతిని ప్రత్యేకంగా కొనియాడారు.

స్వాతంత్ర్యానికి పూర్వం నుండే నిక్కచ్చిగా వార్తలను అందిస్తున్న చరిత్ర ఆంధ్రప్రభకు ఉందని మంత్రి గుర్తుచేశారు. త‌న‌ చిన్నప్పటి నుండే ఆంధ్రప్రభ పత్రికను చదవడం అలవాటని, సమాజంలోని యథార్థాలను ప్రజలకు చేరవేయడంలో ఆంధ్రప్రభ ముందుంటుందని ఆయన పేర్కొన్నారు.

ఏ రాజకీయ పార్టీకి వత్తాసు పలకకుండా, కేవలం ప్రజా సమస్యలే ఎజెండాగా పని చేయడం అభినందనీయమన్నారు. ఆంధ్రప్రభ చైర్మన్ ముత్తా గోపాలకృష్ణతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని, మేనేజింగ్ డైరెక్టర్ ముత్తా గౌతమ్ తనకు ఆప్తమిత్రుడని ఈ సందర్భంగా మంత్రి శ్రీధ‌ర్ బాబు పేర్కొన్నారు.

డిజిటల్ విప్లవంలో ఆంధ్రప్రభ ముందడుగు..

మారుతున్న కాలానికి అనుగుణంగా ఆంధ్రప్రభ డిజిటల్ రంగంలో కూడా దూసుకెళ్తొంద‌ని మంత్రి శ్రీధర్ బాబు కొనియాడారు. కేవలం వార్తాపత్రికగానే కాకుండా, ఆంధ్రప్రభ యాప్/వెబ్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు ప్రజల అరచేతిలోకి తీసుకువస్తున్నారని ప్రశంసించారు. ప్రతిరోజూ సాయంత్రం వెలువడే ‘స్మార్ట్ ఎడిషన్’ ద్వారా తాజా వార్తలను అందించడం విశేషమన్నారు. యూట్యూబ్ వేదికగా కూడా ఆంధ్రప్రభ ప్రజలకు చేరువవుతూ ముందంజలో ఉందని శ్రీధ‌ర్ బాబు అన్నారు.

మంథనిలో ఘనంగా క్యాలెండర్ ఆవిష్కరణ

మంథనిలో జరిగిన ఈ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఆంధ్రప్రభ ఉమ్మడి కరీంనగర్ జిల్లా బ్రాంచ్ మేనేజర్ రవి కిషోర్, మంథని ఆర్సీ ఇంచార్జ్ అంకరీ కుమార్ తో పాటు జర్నలిస్టులు దొరగోర్ల రవీందర్, కేశారపు రవి, విజయ్, జబ్బర్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Leave a Reply